PFI : యూపీ, బీహార్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు

ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, బీహార్ లలో 17 ప్రాంతాల్లో NIA అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

PFI : యూపీ, బీహార్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు

NIA raids

PFI : దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కార్యకలాపాలపై నాలుగు రాష్ట్రాల్లో దాడులు నిర్వహిస్తోంది ఎన్ఐఏ. ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, బీహార్ లలో 17 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. బీహార్ లో 12 ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే యూపీలో రెండు ప్రాంతాలతో సహా మొత్తం దేశ వ్యాప్తంగా 17 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

మంగళవారం (ఏప్రిల్ 25,2023) తెల్లవారుజామునుంచే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో అనుబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లలో ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఎన్ఐఏ బృందం బీహార్ లోని దర్బంగా, మోతీహరిల్లోని పీఎఫ్ఐ సభ్యుల ఇంటికి ఎన్ఐఏ సభ్యులు చేరుకోవటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. దర్భంగాలో డాక్టర్ సరిక్ రజా, మహమ్మద్ అలాగే మోతీహరీలోని సజ్జాత్ అన్సారీ ఇళ్లకు స్థానిక పోలీసులతో పాటు ఎన్ఐఏ టీమ్ తనిఖీలు చేస్తున్నారు. ఇళ్లలో నుంచి ఎవ్వరు బయటకు వెళ్లకుండా..బయట నుంచి ఎవ్వరు లోపలికి రాకుండా అన్ని డోర్లకు తాళాలు వేసి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

సజ్జాద్ అన్సారీ గురించి స్థానికంగా విచారించగా అతను గత 15 నెలలుగా దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. కాగా గత నెలలో మోతీహరీలోనే PFI సభ్యుడు ఇర్షాద్‌ను NIA అరెస్టు చేసింది. అతడిని విచారించగా వెల్లడైన ఆధారాలతో NIA బృందం మోతిహారిలో నిరంతరం దాడులు నిర్వహిస్తోంది. కేసులో దాదాపు ఆరుగురు అనుమానితులను అరెస్టు చేశారు.

అలాగే బీహార్ లోని ఉర్ధూ బజార్ లో నివసిస్తున్న డెంటిస్ట్ సరిక్ రజా ఇంటిలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సింగ్‌వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్‌పూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్, మెహబూబ్ ఇంటికి చేరుకున్నారు NIA బృందం. అధికారుల రాకపై ముందే సమాచారం అందుకున్న మొహమ్మద్. మెహబూబ్ పరారయ్యారు. మెహబూబ్ తల్లితో పాటు సోదరులిద్దరినీ ఎన్ఐఏ విచారించింది. 40 ఏళ్ల మొహమ్మద్. మెహబూబ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. గతంలో ఈ గ్రామంలోని మోసనావుల్లా, మోముస్తాకిం ఇళ్లపై ఎన్‌ఐఏ బృందం దాడులు చేసింది. స్థానికులు డా. సారిక్,మెహబూబ్ వైర్ PFIకి కనెక్షన్స్ ఉన్నట్లుగా అధికారులు తెలుసుకున్నారు. కానీ దీనిపై ఎన్ఐఏ అధికారులు గానీ స్థానిక పోలీసులు గానీ వివరాలను వెల్లడించలేదు.