Closing Bell : భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్ సూచీలు అనూహ్యంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు రావడం, దేశీయంగా పలు కీలక గణాంకాలు ఆశాజనకంగా ఉండడంతో సూచీలు బలపడ్డాయి.

Closing Bell : భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market

Sensex Gains : స్టాక్ మార్కెట్ సూచీలు అనూహ్యంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు రావడం, దేశీయంగా పలు కీలక గణాంకాలు ఆశాజనకంగా ఉండడంతో సూచీలు బలపడ్డాయి. గత రెండు వారాలుగా దేశీయ మార్కెట్ సూచీలు తీవ్ర ఒత్తిడిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..2021, నవంబర్ 01వ తేదీ సోమవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఐటీ, ఆర్థిక రంగాలకు చెందిన షేర్లకు డిమాండ్ పెరిగింది. వీటితో పాటు జీఎస్టీ వసూలు రికార్డు స్థాయికి చేరాయి.

Read More : Elections : ఏపీలో ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల, 11ఏళ్ల తర్వాత..

అంతేగాకుండా..తయారీ కార్యకలాపాలు బలంగా నమోదు కావడంతో సూచీల్లో విశ్వాసం నింపాయి. ఈ పరిణామాలు స్టాక్ మార్కెట ను ముందుకు నడిపించాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం సెన్సెక్స్ 59,577.48 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ట్రేడ్ అవ్వడం ప్రారంభించాయి. తొలి గంటలో అటూ ఇటూ కొనసాగాయి. క్రమంగా పుంజుకుంటూ…ఇంట్రాడే గరిష్టాలకు చేరుకుంది. ఇలాగే..60 వేల కీలక మైలురాయిని తిరిగి చేరుకుంది. ఇంట్రాడేలో 60 వేల 220 వద్ద గరిష్టానికి చేరుకుంది. చివరకు 831 పాయింట్ల లాభంతో 60 వేల 138.46 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 17 వేల 697.10 – 17 వేల 954.10 మధ్య దోబూచులాడింది.

Read More : Chef Salt Bae: చెత్త కవరే టీషర్ట్.. ఇదెక్కడి దిక్కుమాలిన ఫ్యాషన్ రా బాబు!

చివరకు 258.00 పాయింట్లు ఎగబాకి 17 వేల 929.65 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో 26 షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఎస్ బీఐ, కొటాక్ మహీంద్ర, టెక్ మహీంద్ర, టీసీఎస్ తదితర షేర్లు లాభాలబాట పట్టాయి. రిలయెన్స్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్ సర్వే, ఎంఅండ్ఎం ఇతర షేర్లు నష్టపోయాయి. స్థిరాస్తి, టెలికాం, లోహ, టెక్, ఐటీ రంగ షేర్లు రాణించాయి. అంతర్జతీయ మార్కట్ లో చమురు ధరలు తగ్గడం, రూపాయి గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. ఐరోపా మార్కట్లు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. దిద్దుబాటు నేపథ్యంలో ముదుపర్లు సోమవారం కొనుగోళ్లకు ఎగబడ్డారు.