Closing Bell : బ్లాక్ మండే..నష్టాల్లో స్టాక్ మార్కెట్..కారణాలివే

గత కొన్ని రోజులుగా..స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. లాభాల బాట పడుతుందని అందరూ ఆశించారు. కానీ...

Closing Bell : బ్లాక్ మండే..నష్టాల్లో స్టాక్ మార్కెట్..కారణాలివే

Stock Market

Block Monday : గత కొన్ని రోజులుగా..స్టాక్ మార్కెట్ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. లాభాల బాట పడుతుందని అందరూ ఆశించారు. కానీ…2021, నవంబర్ 22వ తేదీ సోమవారం పూర్తిగా నష్టాల్లోకి జారుకోవడంతో మదుపర్లు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అంతర్జాతీయ ప్రతికూలతలు కనిపించచడంతో…నష్టాలకు కారణమని స్టాక్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. సోమవారం స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే…59,710.48 పాయింట్ల వద్ద ప్రతికూలంగా ప్రారంభం కావడంతో..లాభాల్లోకి వెళుతుందని ఆశించారు.

Read More : Bihar : పెళ్లి మంట‌పంలో క‌ల‌క‌లం..వ‌ధువు గ‌దిలో మ‌గ పోలీసుల సోదాలు

తర్వాత..సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా పడిపోయింది. చివరకు 1,170 పాయింట్ల నష్టంతో 58,465.89 వద్ద ముగిసింది. నిఫ్టీ 17, 280.45 వద్ద కనిష్టం వద్ద తాకింది. తర్వాత…17,805.25 వద్ద నిఫ్టీ గరిష్టాన్ని తాకింది. చివరకు 348.25 పాయింట్లు నష్టపోయి…17,416.55 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.40 వద్ద నిలిచింది. బజాజ్ ఫినాన్స్, రిలయెన్స్, ఎస్ బీఐ, కొటాక్ మహీందర్, ఫిన్ సర్వే, బజాజ్ ఆటో, మారుతీతో పాటు ఇతర కంపెనీలు నష్టాలను చవి చూశాయి. రిలయెన్స్ షేర్లు దాదాపు 4.5 శాతం మేర నష్టపోవడం, పేటీఎం అత్యధికంగా 14 శాతం మేర నష్టపోయింది.

Read More : Tamil Nadu : హత్యకు గురైన ఎస్ఐ కుటుంబానికి రూ. కోటి  పరిహారం..ఒకరికి ఉద్యోగం

కారణాలు ఇవే :-

స్టాక్ మార్కెట్ లో నష్టాలను చవి చూడటానికి కారణాలు వెల్లడిస్తున్నారు స్టాక్ మార్కెట్ నిపుణులు. ఫార్మా రంగం మరీ బలహీనంగా ట్రేడ్ కావడం…అంతర్జాతీయ మార్కెట్ లో ప్రతికూల సంకేతాలున్నాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు నెలకొనడం, నిఫ్టీ 50 రోజుల మూవింగ్ యావరేజ్ కిందకు వెళ్లడంతో మదుపర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసిందంటున్నారు. మెజార్టీ వాటా కలిగిన…బజాజ్ ఫిన్ సర్వే, టైటాన్, ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ ఇతర దిగ్గజ షేర్లు భారీ అమ్మకాలన ఎదుర్కొన్నాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండడం కారణంగా చెబుతున్నారు. ఐరోపా దేశాల్లో కేసులు పెరగడం సెంటిమెంట్ ను దెబ్బతీసిందని, జర్మనీలో ఇప్పటికే లాక్ డౌన్ విధించిన విషయాలను గుర్తు చేస్తున్నారు.