BSP MLAs : మాయావతికి ఎదురుదెబ్బ..అఖిలేష్ తో 9మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు భేటీ

ఉత్తరప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది.

BSP MLAs : మాయావతికి ఎదురుదెబ్బ..అఖిలేష్ తో 9మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు భేటీ

Sp

BSP MLAs ఉత్తరప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలే గడువు ఉన్న సమయంలో బీఎస్పీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాయావతికి బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. తొమ్మిది మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు.. హకీమ్ లాల్ బింద్, వందన సింగ్, రామ్‌వీర్ ఉపాధ్యాయ, అనిల్ కుమార్ సింగ్, అస్లాం రైనీ, అస్లాం అలీ, ముజ్తాబా సిద్దిఖీ, హర్గోవింద్ భార్గవ సిధౌలి, సుష్మా పటేల్ మంగళవారం లక్నోలో సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్‌లను కలిశారు. వీరందరూ త్వరలోనే ఎస్పీలో చేరనున్నట్లు సమాచారం. ఈ అంశమై వీరంతా కొద్దిసేపు అఖిలేష్ యాదవ్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

కాగా 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ19 సీట్లు గెలుచుకుంది. కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ గడిచిన 18 నెలల్లో లెజిస్లేటివ్ పార్టీ లీడర్ సహా 11మంది ఎమ్మెల్యేలను మాయావతి పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంలో కూడా ఏడుగురు రెబెల్ నేతలను ఆమె సస్పెండ్ చేశారు. కాగా అసెంబ్లీలో ప్రస్తుతమున్న వారిని ఇంకా సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించలేదు. 2019లో లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో ఒక బీఎస్పీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం బీఎస్పీకి 7 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

ఇక, 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పటికీ .. రెండేళ్లలో ఈ పొత్తు విఫలమైంది. మాయావతి,అఖిలేష్ యాదవ్ చెరో దారి పట్టారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ,బీఎస్పీ పొత్తు లేకుండా విడివిడిగానే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.