Giaspura Gas Leak: పంజాబ్‌లో విషాదం.. విషవాయువు లీక్ కావడంతో తొమ్మిది మంది మృతి ..

పంజాబ్‌లో విషవాయువు లీక్ కావడంతో తొమ్మిది మంది మరణించారు. మరో 11 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

Giaspura Gas Leak: పంజాబ్‌లో విషాదం.. విషవాయువు లీక్ కావడంతో తొమ్మిది మంది మృతి ..

Ludhiana Gas Leak

Giaspura Gas Leak: పంజాబ్ లో విషాదం చోటు చేసుకుంది. విషవాయువు లీక్ కావడంతో తొమ్మిది మంది మరణించారు. మరో 11 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా జిల్లాలోని గయాస్‌పురా ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. విషవాయువు లీకేజీతో చుట్టూ గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు, అధికార యంత్రాంగం మొత్తం ఆ ప్రాంతానికి చేరుకొని సీజ్ చేశారు. ఆ ప్రాంతంలోకి ఎవరిని వెళ్లకుండా చర్యలు చేపట్టారు.

Jammu and Kashmir Earthquake: జమ్మూ‌కాశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతగా నమోదు

ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విషవాయువు ఫ్యాక్టరీ నుంచి వెలువడిందా? ఏ కారణంగా లీక్ అయిందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఘటనపై లూథియానా వెస్ట్ కు చెందిన ఎస్డీఎం స్వాతి మాట్లాడుతూ.. ఖచ్చితంగా ఇది గ్యాస్ లీక్ కేసు. ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించాం. ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ఇదిలాఉంటే ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో తొక్కిసలాటలాంటి పరిస్థితి ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు జాతీయ మీడియాకు వెల్లడించారు. సమీపంలోని ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీక్ అయిందని స్థానికులు పేర్కొన్నారు.

Chandrababu Naidu : బాలకృష్ణపై, ఆయన ఇంటిపై రాడ్లు, కర్రలతో దాడి.. చంద్రబాబు సీరియస్, డీజీపీకి లేఖ

ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. లూథియానాలోని గయాస్‌పురా ప్రాంతంలో గ్యాస్ లీక్ ఘటన బాధాకరమని అన్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. అన్నివిధాలా సహాయం చేస్తున్నారని సీఎం అన్నారు.