పాప పియానో ప్లే చేస్తుండగానే..బ్రెయిన్ సర్జరీ చేసేశారు

  • Published By: venkaiahnaidu ,Published On : December 14, 2020 / 03:24 PM IST
పాప పియానో ప్లే చేస్తుండగానే..బ్రెయిన్ సర్జరీ చేసేశారు

Nine-Year-Old Gwalior Girl Plays Piano For Six Hours During Brain Surgery పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇంజక్షన్ అంటే భయమే. అలాంటిది సర్జరీ అంటే ఇంకెంత భయం, ఆందోళన ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధైర్యవంతుల్లో కూడా చిన్నపాటి ఆందోళన సహజం. అయితే, మధ్యప్రదేశ్ కి చెందిన ఓ 9ఏళ్ల చిన్నారి మాత్రం బ్రెయిన్‌ సర్జరీ జరుగుతుండగా ఏ మాత్రం భయపడలేదు సరి కదా.. ఏకంగా పియానో‌(ఎలక్ట్రానిక్ సంగీత పరికరం)ప్లే చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది.దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోరీనా జిల్లాలోని బన్మోర్ టౌన్ కి చెందిన సౌమ్య(9) కొన్నాళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ తో భాధపడుతోంది. దీంతో సౌమ్యని తల్లిదంద్రులు గ్వాలియర్‌ లోని బిర్లా హాస్పిటల్ లో చేర్పించారు. టెస్టులు చేసిన డాక్టర్లు సౌమ్యకి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. అయితే సాధారణంగా ఆపరేషన్‌ కు ముందు మత్తు మందు ఇస్తారు.

కానీ సౌమ్య విషయంలో ఇలా మత్తు మందు ఇచ్చి సర్జరీ చేయడం ప్రమాదమని..దాని వల్ల మెదడులోని ఇతర నరాలు దెబ్బతింటాయని డాక్టర్లు భావించారు. సౌమ్యకి అవేక్ క్రానియోటమీ(రోగి మెలకువగా ఉండగానే సర్జరీ చేయడం)పద్ధతిలో సర్జరీ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. ఇందులో భాగంగా సౌమ్య దృష్టి మరల్చడం కోసం డాక్టర్లు వినూత్న ఆలోచన చేశారు. సౌమ్యకు సర్జరీ చేస్తుండగా పియానో లేదా కీబోర్టు ఇవ్వాలని…పాప దానితో ఆడుకుంటూ శస్త్ర చికిత్స విషయం మర్చిపోతుందని భావించారు.

సర్జరీ చేసే భాగం వరకు మాత్రమే మత్తు మందు ఇచ్చారు. సౌమ్య.. కీబోర్డు ప్లే చేస్తున్న సమయంలో దాదాపు 6 గంటల పాటు శ్రమించి సౌమ్య బ్రెయిన్ లోని ట్యూమర్ ని విజయవంతంగా తొలగించారు. ఆ తర్వాత సౌమ్యను ఆబ్జర్వేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యవంతంగా ఉందని ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లలో ఒకరైన అభిషేక్ చౌహాన్ తెలిపారు. తాను పియానా ప్లే చేయడంతో పాటుగా మొబైల్ గేమ్స్ కూడా ఆడినట్లు సౌమ్య తెలిపింది.