Viral News: తొమ్మిదేళ్ల బుడ్డోడు.. 427 గ్రామాలకు పెదరాయుడు!

అప్పట్లో ఊరు వాడ నుండి పట్టణాల వరకు ఓ ఊపు ఊపేసిన సినిమా పెదరాయుడు. ఆయన వస్తుంటే దర్జా, దర్పం.. ఆయన మాటకుండే విలువ, ఆయన నమ్ముకున్న నీతి, నియమాలు, సిద్ధాంతాలను ఆ సినిమాలో ఉన్నతంగా చూపిస్తారు. అందుకే ఆయన మాటంటే చుట్టుపక్కల గ్రామాలలో రాయని శాసనం. ఇప్పటికీ కొన్ని మారు మూల ప్రాంతాలలో ఈ పెదరాయుడు తీర్పులు సాగుతుండగా తమిళనాడులోని చాలా గ్రామాలలో ఇప్పటికీ ఈ ఆచారం కనిపిస్తుంది.

Viral News: తొమ్మిదేళ్ల బుడ్డోడు.. 427 గ్రామాలకు పెదరాయుడు!

Viral News

Viral News: అప్పట్లో ఊరు వాడ నుండి పట్టణాల వరకు ఓ ఊపు ఊపేసిన సినిమా పెదరాయుడు. ఆయన వస్తుంటే దర్జా, దర్పం.. ఆయన మాటకుండే విలువ, ఆయన నమ్ముకున్న నీతి, నియమాలు, సిద్ధాంతాలను ఆ సినిమాలో ఉన్నతంగా చూపిస్తారు. అందుకే ఆయన మాటంటే చుట్టుపక్కల గ్రామాలలో రాయని శాసనం. ఇప్పటికీ కొన్ని మారు మూల ప్రాంతాలలో ఈ పెదరాయుడు తీర్పులు సాగుతుండగా తమిళనాడులోని చాలా గ్రామాలలో ఇప్పటికీ ఈ ఆచారం కనిపిస్తుంది. తరాలు మారినా.. యుగాలు మారినా ఇక్కడ ఇప్పటికి చాలా ప్రాంతాలలో ఈ గ్రామ పెద్ద సంస్కృతి కొనసాగుతూనే ఉంది.

అయితే.. ఇలా పెద్దలుగా నియమించుకునే వారంతా అనుభవం కలిగిన వృద్దులై.. మంచి, చెడు వారి వారి ఆచారాలు, కట్టుబాట్లపై అపార అనుభవం కలిగిన వారై ఉండడంతో ప్రజలు కూడా వారి మాటకి విలువ ఇస్తూ వస్తుంటారు. కానీ, తొమ్మిదేళ్ల బాలుడిని ఏకంగా 427 గ్రామాలకు పెద్దగా నియమించుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై, వెల్లూర్, తిరుపట్టూర్ జిల్లాలలో 427 గ్రామాలు ఉండగా ఈ గ్రామాలన్నిటికీ శక్తివేల్ అనే తొమ్మిదేళ్ల బాలుడిని పెద్దగా నియమించుకున్నారు.

ఈ 427 గ్రామాలకు చెందిన ప్రజలు రక్షణ కోసం, న్యాయం కోసం పోలీసులు, కోర్టులను ఆశ్రయించరు. ఏ సమస్య వచ్చినా ఆ పెద్ద దగ్గరకు వెళ్తే.. అతనే అక్కడిక్కడ తీర్పు ఇచ్చేస్తాడు.. అవసరమైతే శిక్షలు కూడా అమలు చేస్తాడు. అయితే, ఇన్ని గ్రామాలకి ఇప్పుడు తీర్పు ఇచ్చేది కేవలం 9 సంవత్సరాల వయసుండే ఓ బుడ్డోడు. పేరు శక్తి వేల్ కాగా.. ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్నాడు. నిజానికి శక్తి వేల్ తాతయ్య చిన్నంది (87) నిన్న మొన్నటి వరకు ఈ గ్రామాలకి పెద్దగా ఉండగా అనారోగ్య కారణాలతో ఆయన మరణం అనంతరం అంతా కలసి తమ నూతన నాయకుడిగా ఎన్నుకున్నారు.

కొండప్రాంతమైన ఈ మూడు జిల్లాలలో జావదు అనే తెగ ప్రజలు ఈ పంచాయతీ తీర్పు సంస్కృతిని బలంగా నమ్ముతుండగా.. మూడు తరాలుగా ఒక కుటుంబమే ఈ పంచాయతీ తీర్పులు ఇస్తుంది. చిన్నంది మరణం అనంతరం ఇప్పుడు ఆయన మనవడు శక్తివేల్ ను పెద్దగా ఎన్నుకోగా ప్రస్తుతం శక్తివేల్ వయసు రీత్యా అన్ని సమస్యలకి తీర్పు చెప్పలేకపోతున్నాడని.. కట్టుబాట్లు, ఆచారాలు, సంస్కృతిపై ప్రస్తుతం కొంత ట్రైనింగ్ కూడా ఇస్తున్నారట. త్వరలోనే పూర్తిస్థాయిలో శక్తివేల్ ఆ ప్రాంతాల పెద్దగా పూర్తిస్థాయిలో అవతరించబోతున్నాడట.