మీసాల పిల్లి : నీరవ్ మోడీని ఆ కెమెరానే పట్టించింది!

మీసాల పిల్లి : నీరవ్ మోడీని ఆ కెమెరానే పట్టించింది!

మీసాల పిల్లి : నీరవ్ మోడీని ఆ కెమెరానే పట్టించింది!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)కి రూ.13వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్ట్ ఎలా జరిగింది.. ఎవరు పట్టించారు.. ఎలా చిక్కాడు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నీరవ్ మోడీని పట్టించింది మాత్రం ఓ కెమెరా. అవును ఇది పచ్చి నిజం. 10 రోజుల క్రితం లండన్ వీధుల్లో తిరుగుతున్న నీరవ్ మోడీని బ్రిటన్ కు చెందిన టెలిగ్రాఫ్ లోకల్ రిపోర్టర్ కు దొరికాడు. రోజూ మాదిరిగానే నీరవ్ చక్కగా వీధుల్లో చక్కర్లు కొడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో వచ్చిన నీరవ్ మోడీ ఫొటోలు – వాస్తవానికి చాలా తేడా ఉన్నాయి. ఇప్పుడు అయితే తెల్లజుట్టు, మీసాలు పెంచాడు.. గడ్డెం పెంచాడు.. డ్రస్ కూడా మారిపోయింది.. ఇలా మొత్తం మనిషి మారిపోయాడు. ఇంత మారినా టెలిగ్రాఫ్ లోకల్ రిపోర్టర్ మాత్రం గుర్తించేశాడు. నీరవ్ మోడీ కదా అని ప్రశ్నించాడు. విజువల్ తీశాడు. 
Read Also : దొంగ దొరికాడు : లండన్ లో నీరవ్ మోడీ అరెస్ట్

నీరవ్ మోడీని గుర్తించిన లోకల్ రిపోర్టర్ ఇంటర్వ్యూ చేయటానికి ప్రయత్నించాడు. అన్నింటికీ నో కామెంట్ అని వెళ్లిపోయాడు. ఈ విజువల్స్ చూసిన అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇండియన్ మీడియా లండన్ వాలిపోయింది. మోడీని పట్టుకుని.. ఇంటర్వ్యూలు చేసే పనిలో బిజీ అయ్యింది. రెండు రోజుల క్రితం ఓ జాతీయ ఛానల్ రిపోర్టర్ లండన్ వీధుల్లో వెళుతున్న మోడీని వెంబడించారు.రిపోర్టర్ ని చూసి నీరవ్ పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ.. అత్యంత ఖరీదైన ప్రాంతంలోని ఓ ఇంట్లో విలాసంగా బతుకుతున్నాడు. వజ్రాల వ్యాపారం కూడా చేస్తున్నాడు. ఇన్ని విషయాలు వెలుగులోకి రావటంతో.. భారత ప్రభుత్వం కూడా బ్రిటన్ పై ఒత్తిడి పెంచింది.దీంతో నీరవ్ మోడీని మార్చి 20, 2019న లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ ని ఈడీ కూడా ధృవీకరించింది.

పీఎన్ బీ స్కామ్ వెలుగులోకి వచ్చే రెండురోజులు ముందుగానే దేశం వదిలి పారిపోయాడు నీరవ్. అప్పటి నుంచి  భారత అధికారులు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. నీరవ్ ను పట్టుకునేందుకు రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు.మనోడు మాత్రం దర్జాగా లండన్ లో రోడ్లపై తిరుగుతుంటే దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమైపోయాయి అంటూ దేశ వ్యాప్తంగా ప్రజలు ప్రశ్నలు కురిపిస్తున్నారు. పీఎన్ బీ కుంభకోణంలో ఎవరైనా పెద్ద రాజకీయనాయకుల పాత్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారే నీరవ్ ని రక్షిస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. దర్యాప్తు సంస్థల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో నీరవ్ మోడీ అరెస్ట్ కీలకంగా మారింది. 

నీరవ్ వెనుక ఉన్నది ఎవరు?కేంద్రంలోని కొందరు పెద్దలే నీరవ్ కు సహకరించారా? సహకరిస్తే ఆ వ్యక్తులు ఎవరు?ఎందుకు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. నీరవ్ కు ప్రధాని అండదండలు ఉన్నాయంటూ గతంలో కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. దేశం వదిలి పారిపోయే కొన్నిరోజుల ముందు దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇండియన్ బిజినెస్ డెలిగేషన్ లో నీరవ్ కూడా ప్రధాని మోడీ పక్కన ఉండటంపై కాంగ్రెస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నీరవ్ కు సంబంధించిన పలు ఆస్తులను భారత అధికారులు జప్తు చేశారు. వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. నీరవ్ లానే భారత బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ లో కింగ్ సైజ్ లైఫ్ అనుభవిస్తున్న విజయ్ మాల్యా ఇప్పటికీ భారత్ చేరుకోలేదు. మాల్యా భారత్ కు వచ్చేసేందుకు పూర్తి కావాల్సిన ఫార్మాలిటీస్ కు మరికొన్ని రోజులు పట్టే అవకాశముంది. ఇప్పుడు నీరవ్ భారత్ కు ఎప్పుడు వస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు.
Read Also : షాక్ ఇచ్చిన లండన్ కోర్టు : నీరవ్ మోడీకి అరెస్ట్ వారెంట్

×