Updated On - 5:33 pm, Thu, 25 February 21
Nirav Modi పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి దాదాపు రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టు షాకిచ్చింది. నీరవ్ ను భారత్ కు అప్పగించే కేసుపై రెండేళ్లుగా కొనసాగుతున్న విచారణలో లండన్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.
నీరవ్‌పై మనీలాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని కోర్టు పేర్కొంది. నీరవ్ ను విచారించేందుకు భారత్‌కు అప్పగించాలని తీర్పు చెప్పింది. భారత్‌కు అప్పగిస్తే తనకు న్యాయం జరగదని, ఆరోగ్య స్థితి సరిగ్గా లేదనే సాకులతో నీరవ్ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. భారత్‌కు అప్పగిస్తే అన్యాయం జరుగుతుందనే వాదనకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
భారత్‌కు అప్పగించినా ఆయనకు అన్యాయం జరగదని కోర్టు స్పష్టం చేసింది. ఆయనకు మానసిక స్థితి సరిగాలేదనే వాదనను కోర్టు కొట్టి పారేసింది. నీరవ్ కు ముంబై ఆర్థర్ రోడ్ జైలులోని 12వ బ్యారక్ సరిపోతుందని కోర్టు పేర్కొంది. అక్కడే ఆయనకు కావాల్సిన చికిత్స కూడా అందించాలని సూచించింది. నీరవ్ మోడీ సాక్ష్యాలను నాశనం చేశారని కోర్టు తెలిపింది.
Priyanka Chopra : ప్లీజ్.. ఇంట్లోనే ఉండండి.. కచ్చితంగా పెట్టుకోండి.. దేశ ప్రజలకు ప్రముఖ హీరోయిన్ విజ్ఞప్తి
India’s export of liquid oxygen: కరోనా వేళ..9,234మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను విదేశాలకు అమ్మిన భారత్
Triple Mutation Variant: ట్రిపుల్ మ్యుటేషన్ వేరియంట్.. కొవిడ్ మహమ్మారి విసురుతున్న మరో ఛాలెంజ్
Vaccine Wastage : దేశ వ్యాప్తంగా 23 శాతం వ్యాక్సిన్లు వృథా : సమాచార హక్కు చట్టం
కరోనా తుఫాన్.. దేశంలో కొత్తగా 2లక్షల 59వేల కేసులు
India’s COVID Cases : కరోనా కల్లోలం, భారతదేశంలో భయానక పరిస్థితులు..వణికిపోతున్న రాష్ట్రాలు