నిర్భయ దోషులకు ఉరి వేయటానికి తలారి పవన్ జల్లాద్ ట్రయల్స్

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 07:39 AM IST
నిర్భయ దోషులకు ఉరి వేయటానికి తలారి పవన్ జల్లాద్ ట్రయల్స్

నిర్భయ దోషులను  ఉరి తీసేందుకు తలారి మనోజ్ జల్లాద్ తీహార్ జైల్లో  ట్రయల్స్ నిర్వహిస్తున్నాడు. ఉరి నుంచి తప్పించుకునే నిర్భయ హత్యాచారం దోషులు నానా యత్నాలు చేస్తున్నారు. కానీ వారి ఉరి తప్పించుకునే పరిస్థితులు కనిపించటంలేదు. ఈ క్రమంలో ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాలను ఉరి వేయటానికి తలారి పవన్ జల్లాద్ నలుగురిని ఒకేసారి ఉరి తీయటానికి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 

ఇప్పటికే ఉరితాళ్లు సిద్ధమయ్యాయి. నలుగురు దోషులు ముఖేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తాల బరువుకు సమానమైన ఇసుక బస్తాలతో తలారి పవన్ జల్లాద్ రిహాల్సస్ చేస్తున్నాడు. దీని కోసం పవన్ జల్లాది రెండు రోజుల ముందే తీహార్ జైలుకు అధికారులు తరలించారు. వీరిని ఉరి తీయటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ఉరి తీయటానికి ట్రయల్స్ నిర్వహిస్తున్నాడు తలారి పవన్ జల్లాద్. 

ఉరి నుంచి తప్పించుకోవటానికి దోషులు పలు యత్నాలు చేస్తున్న క్రమంలో ఢిల్లీ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తీహార్ జైలు అధికారులు తెలిపారు. కాగా వీరి నలుగురికి ఒకేసారి ఫిబ్రవరి 1 ఉరి శిక్ష అమలు ఖరారైంది. 

కాగా..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ లైంగికదాడి, హత్య కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుపై మరోసారి అనిశ్చితి నెలకొన్నది. ఫిబ్రవరి 1న వారిని ఉరితీయడం అనుమానంగానే ఉన్నది. ఈ కేసులో రెండో దోషి అయిన వినయ్‌కుమార్‌ శర్మ బుధవారం రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలుచేయగా, మూడో దోషి అయిన అక్షయ్‌కుమార్‌ సింగ్‌ సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ను దాఖలుచేశాడు. ఢిల్లీ జైలు నిబంధనల ప్రకారం.. ఒక కేసులో పలువురు దోషులున్నప్పుడు చివరి దోషి కూడా తనకున్న న్యాయపరమైన హక్కులను వినియోగించుకునేంత వరకు వారిలో ఏ ఒక్కరికీ ఉరిశిక్ష అమలు చేయడానికి వీల్లేదు.

అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించిన తరువాత 14 రోజుల వరకు దోషులను ఉరితీయకూడదు. నిర్భయ కేసులో నలుగురు దోషులు ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ కుమార్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌లను ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరితీయాలని ట్రయల్‌ కోర్టు ఈ నెల 17న రెండోసారి డెత్‌ వారంట్‌ జారీచేసింది. అంతకుముందు ఈ నెల 22న ఉరితీయాలంటూ ఈ నెల 7న వారంట్‌ జారీచేసిన్పటికీ అది వాయిదాపడింది.

కానీ నలుగురు దోషులను ఉరి తీయటానికి ఢిల్లీ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తీహార్ జైలు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రేపు నలుగురు దోషులను ఉరి అమలు జరుగుతుందా? లేదా? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు దేశమంతా ఈ నలుగురు దుర్మార్గులను ఉరి తీసే రోజు కోసం  ఎదురు చూస్తోంది.