నిర్భయ దోషి పిటిషన్ ను రాష్ట్రపతికి పంపిన హోంశాఖ

  • Published By: venkaiahnaidu ,Published On : January 17, 2020 / 05:51 AM IST
నిర్భయ దోషి పిటిషన్ ను రాష్ట్రపతికి పంపిన హోంశాఖ

నిర్భయ దోషులకు ఉరిశిక్షపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేష్ కుమార్ పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ పు ఇవాళ(జనవరి-17,2020)కేంద్రహోంశాఖ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపించింది. మంగళవారం నలుగురు దోషుల్లోని ఒకడైన వినయ్ శర్మ వేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ముఖేష్ ఈ పిటిషన్ వేశాడు. ఈ కేసులో నలుగురు  దోషులకు ఉరిశిక్ష అమలు చేసేముందు వాళ్లకు ఉన్న చివరి ఆఫ్షన్ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరడం మాత్రమే అన్న విషయం తెలిసిందే.

అయితే ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించాలన్న సిఫార్సులతో రాష్ట్రపతికి హోంశాఖ ఆ పిటిషన్ ను ఫార్వార్డ్ చేసింది. ఈ కేసులోని నలుగురు దోషులైన వినయ్ శర్మ,ముఖేష్ కుమార్,అక్షయ్ కుమార్,పవన్ గుప్తాలను ఈ నెల 22న ఉదయం 7గంటలకు ఉరితీయాలని గత వారం పటియాలా కోర్టు జడ్జి బ్లాక్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తీర్పు ప్రకారం దోషుల ఉరికి మరో వారం రోజుల గడువు మాత్రమే ఉన్న సమయంలో…దోషులను ఉరితీయడానికి మరికొన్ని రోజుల సమయం కావాలని గురువారం తీహార్ జైలు అధికారులు కోరారు.

దోషులు దాఖలు చేసిన అన్ని క్షమాబిక్ష పిటిషన్లు క్లియర్ అయ్యేంతవరకు ఉరితీయలేమని తెలిపారు. వారి పిటిషన్లను తిరస్కరించాలని,ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రపతికి గట్టిగా సిఫారసు చేసింది. ఉరిశిక్ష అమలు చేయడానికి ముందు దోషులకు తప్పనిసరిగా 14 రోజుల ఉపశమనం ఇవ్వబడుతుంది. దీంతో ఈ నెలాఖరులో గానీ లేదా వచ్చే నెల ప్రారంభంలో కానీ దోషులను ఉరితీసే అవకాశముంది.

దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.