నిర్భయ దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించిన రాష్ట్రపతి

  • Published By: veegamteam ,Published On : February 1, 2020 / 05:24 AM IST
నిర్భయ దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించిన రాష్ట్రపతి

నిర్భయ దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష పిటీషన్ ను  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఉరి శిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు పలు డ్రామాలకు తెరతీస్తున్నారు. నిర్భయను అత్యంత పాశవికంగా హింసించి ఆమె మృతికి కారణమైన నిందితులు తమ ప్రాణాలపై మాత్రం ఆశను చంపుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో క్షమాభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతికి పిటీషన్ పెట్టుకుంటున్నారు. ఇలా పలు కీలక పరిణామాల మధ్య ఉరి శిక్ష ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. తరువాత ఫిబ్రవరి 1న ఉరిశిక్ష తేదీ ఖారారైంది. దానికి సంబంధించి తలారిని కూడా నియమించింది. 

నలుగురు దోషులకు ఒకేసారి ఉరి శిక్ష వేయటానికి తీహార్ జైల్లో ఉరి తీసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఉరితాళ్లు కూడా సిద్ధమయ్యాయి. కానీ నలుగురు దోషుల్లో ఒకడ వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవటంతో మరోసారి ఉరి వాయిదా పడింది. ఇలా పలు హైడ్రామాలతో ఉరిశిక్షను తప్పించుకోవాలని నిర్భయ దోషులు యత్నాలు చేయటంతో నిర్భయ కుటుంబ సభ్యులతో పాటు దేశ వ్యాప్తంగా అసంతృప్తులు వెల్లడవుతున్నాయి. ఇంతటి దుర్మార్గానికి పాల్పడడ్డ దుర్మార్గులకు త్వరగా ఉరి శిక్షను అమలు చేయాలనే డిమాండ్స్ వినిపింస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు ఉరి వాయిదా పడటం సరికాదంటున్నారు.  

ఈ కేసులో మరో నిందితుడు ముఖేష్ కుమార్ క్షమాబిక్ష పిటిషన్ ను జనవరి-17,2020న రాష్ట్రపతి తిరస్కరించిన విషయం తెలిసిందే. తన క్షమాబిక్షను తిరస్కరించడంపై సుప్రీంను ఆశ్రయించాడు ముఖేష్. అయితే బుధవారం ముఖేష్ పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు. ఫిబ్రవరి-1 ఉదయం 6గంటలకు నలుగురు నిందితులను ఉరితీయాలంటూ జనవరి17,2020న ట్రయల్ కోర్టు రెండోసారి బ్లాక్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు నిందితులను జనవరి-22,2020న ఉరితీయాలంటూ జనవరి-7,2020న కోర్టు బ్లాక్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇలా ఈ కేసులో క్షమాభిక్ష పిటీషన్ల పేరుతో నిందితులు ఉరి నుంచి తప్పించుకోవాలని శతవిధాలా యత్నిస్తున్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. నలుగురు నిందితులకు వెంటనే ఉరిశిక్షను అమలు చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. 
 
దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక దారుణ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.