జైల్లో నాపై లైంగిక దాడి జరిగింది :ఉరికి ముందు Nirbhaya దోషి సంచలన ఆరోపణలు

Nirbhaya కేసులో త్వరలో ఉరి శిక్ష అనుభవించబోతున్న దోషి Mukesh Singh సంచలన ఆరోపణలు చేశాడు. జైల్లో తనపై లైంగిక దాడి జరిగిందని ముకేష్ చెప్పాడు. సహ

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 12:02 PM IST
జైల్లో నాపై లైంగిక దాడి జరిగింది :ఉరికి ముందు Nirbhaya దోషి సంచలన ఆరోపణలు

Nirbhaya కేసులో త్వరలో ఉరి శిక్ష అనుభవించబోతున్న దోషి Mukesh Singh సంచలన ఆరోపణలు చేశాడు. జైల్లో తనపై లైంగిక దాడి జరిగిందని ముకేష్ చెప్పాడు. సహ

Nirbhaya కేసులో త్వరలో ఉరి శిక్ష అనుభవించబోతున్న దోషి Mukesh Singh సంచలన ఆరోపణలు చేశాడు. జైల్లో తనపై లైంగిక దాడి జరిగిందని ముకేష్ చెప్పాడు. సహ నిందితుడు అక్షయ్ ఠాకూర్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిపాడు. జైలు అధికారుల సహకారంతోనే ఇది జరిగిందన్నాడు. రాష్ట్రపతికి ఈ విషయాలు తెలియకుండానే తన క్షమాభిక్ష పిటిషన్ కొట్టేశారని వాపోయాడు. Mercy Petition పై నిర్ణయంలో జాప్యం చేయడం అమానవీయం అన్నాడు.

క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై ముకేష్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ముకేష్ తరుఫు లాయర్ అంజనా ప్రకాశ్ వాదనలు వినిపించారు. జైల్లో ముకేష్ పై లైంగిక దాడి జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

mukesh

ముకేష్ ఆరోపణలపై కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ముకేష్ ను జైల్లో వేధించడం క్షమాభిక్షకు అర్హత కాదని చెప్పారు. నిర్భయ కేసులో నలుగురు దోషులు ముకేష్, పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ ఠాకూర్ ని ఫిబ్రవరి 1న ఉరి తీయనున్నారు. ఈ క్రమంలో తన క్షమాభిక్ష పిటిషన్ ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ దోషి ముకేష్ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. కొన్ని రోజుల్లో ఉరి తీయనున్నారు కనుక.. అతడి పిటిషన్ ను అత్యవసరంగా విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు.

సౌత్ ఢిల్లీలో 2012 డిసెంబర్ 12న కదులుతున్న బస్సులో మెడికల్ స్టూడెంట్ నిర్భయను గ్యాంగ్ రేప్ చేశారు. నిర్భయను తీవ్రంగా గాయపరిచారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన నిర్భయ.. చివరికి ప్రాణం వదిలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మొత్తం ఆరుగురు దోషులు కాగా.. ఒకడు జైల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు మైనర్ కావడంతో జువైనల్ జైల్లో శిక్ష అనుభవించాడు.

తన క్లయింట్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించడంపై అత్యవసర విచారణ చేపట్టాలని ముకేష్ తరుఫు లాయర్ సుప్రీంకోర్టుని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ బాబ్డే.. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ను ఆశ్రయించాలని సూచించారు. ఫిబ్రవరి 1న మరణ శిక్ష అమలు నేపథ్యంలో ఈ పిటిషన్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు సీజేఐ. దీంతో నిర్భయ కేసులో ముకేష్ వేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు మంగళవారం(జనవరి 28,2020) విచారణ జరిపింది. క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించడంపై ఆర్టికల్ 32 కింద జుడీషియల్ రివ్యూ కోరుతూ ముకేష్ సింగ్ శనివారం(జనవరి 25,2020) సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 1న ఉరి తీయాలని జారీ చేసిన డెత్ వారెంట్ పై స్టే విధించాలని పిటిషన్ లో కోరాడు. కాగా, తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ ముకేష్ చేసిన అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జనవరి 15న తిరస్కరించిన విషయం విదితమే. మరో ఇద్దరు దోషులు వినయ్, ముకేష్ ల క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే తిరస్కరించింది. నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్ చేసింది. ఉరి తీసేందుకు తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఉరి శిక్ష తప్పించుకునేందుకు నిర్భయ దోషులు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. 

Also Read : యుద్ధం వస్తే 10 రోజుల్లో ఓడిస్తాం : పాకిస్తాన్ పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు