నిర్భయ దోషులకు మార్చి 20న ఉరి 

నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ అయింది. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని పటియాల కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

  • Published By: veegamteam ,Published On : March 5, 2020 / 09:27 AM IST
నిర్భయ దోషులకు మార్చి 20న ఉరి 

నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ అయింది. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని పటియాల కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ అయింది. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాలని పటియాల కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దోషులకు ఇది నాలుగో డెత్ వారెంట్. వరుసగా మూడుసార్లు ఉరి వాయిదా పడింది. ఇప్పుడు నాలుగో డెత్ వారెంట్ ఇవాళ జారీ అయింది. మొదటి జనవరి 22న అది వాయిదా పడింది. తర్వాత ఫిబ్రవరి1, తర్వాత మార్చి 3 డెత్ వారెంట్ జారీ చేశారు. ఇప్పుడు నాలుగోసారి మార్చి 20న ఉరితీయాలని తాజాగా దోషులను ఉరితీయాలని కోర్టు తెలిపింది. 

దోషులకు న్యాయపరమైనటువంటి అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. దోషులకు గడువు మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. మూడు సార్లు ఉరి వాయిదా పడింది. నాలుగోసారి డెత్ వారెంట్ జారీ అయింది. మార్చి 20న ఉదయం 5.30 గంటలకు దోషులను ఉరి తీయాలని పటియాల కోర్టు ఆదేశించింది. దోషులకు ఇది నాలుగో సారి డెత్ వారెంట్. 

See Also | కట్నం కోసం భార్యను వేధిస్తున్న Flipkart అధినేత..మరదలిపైనా లైంగిక వేధింపులు

నలుగురు దోషులకు ఉన్న అన్ని అవకాశాలు పూర్తి కావడంతో డెత్ వారెంట్ జారీ చేశారు. తాజాగా డెత్ వారెంట్ జారీ చేయాలని నిర్భయ తల్లి, అలాగే తీహార్ జైలు అధికారులు పటియాల హౌజ్ కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి పటియాల హౌజ్ కోర్టు నిన్న దోషులకు నోటీసులు ఇచ్చింది. తాజాగా మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నిర్భయ దోషులను ఉరితీయాలంటూ నాలుగోసారి డెత్ వారెంట్ ను జారీ చేశారు.

అయితే దోషి పవన్ గుప్తా తరపు న్యాయవాది ఏపీ సింగ్ తనకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పినా కూడా వీరికున్న న్యాయపరమైన అన్ని అవకాశాలు ముగిసిపోవడంతో నాలుగోసారి డెత్ వారెంట్ జారీ చేశారు. పటియాల కోర్టు ధర్మేంద్రసింగ్ రాణా ధర్మాసనం నాలుగో సారి డెత్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికీ మూడుసార్లు డెత్ వారెంట్ వాయిదా పడింది. ఇంకా న్యాయపరమైన అవకాశాలు మిగిలి ఉన్నాయి. న్యాయపరంగా చంపేస్తున్నారని….న్యాయపరమైన అవకాశాలున్నా కూడా వీరిని ఉరితీసేందుకు కోర్టు ఆదేశాలు ఇస్తుందని లాయర్ ఏపీ సింగ్ చెబుతున్నారు.

అక్షయ్, పవన్ లను వారి తరపు న్యాయవాదులు తీహార్ జైలులో కలిసేందుకు అనుమతి ఇచ్చారు. ఇవాళ ఈ డెత్ వారెంట్ కు ముందు ఏపీ సింగ్ వాదనల సందర్భంగా ఇంకా రాష్ట్రపతి ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు..ఏ ఏ అంశాలను పరిశీలించారు అనేది ఆర్ టీఐ ద్వారా ఫైల్ చేయాలనుకుంటున్నానని..రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించడాన్ని పై కోర్టులో సవాల్ చేయాలనుకుంటున్నానని ఏపీ సింగ్ వాదనలు వినిపించారు. అయితే ఇంకా ఎంటువంటి పిటిషన్ దాఖలు చేయనందున ఇప్పటికైతే డెత్ వారెంట్ జారీ చేశారు. ఇప్పటికీ నాలుగు సార్లు దోషులను చంపేస్తున్నారు..చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఏపీ సింగ్ మీడియాతో మాట్లాడారు.

నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేయడం పట్ల నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా దోషులకు ఉరిశిక్ష అమలు అవుతుందని ఆశిస్తున్నట్లు మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు న్యాయపరంగా, రాజ్యాంగ బద్ధంగా వీరికున్న క్షమాభిక్ష అవకాశాలన్నీ ఒకరి తర్వాత ఒకరు వినియోగించుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు మళ్లీ అన్ని అవకాశాలకు కూడా నలుగురు దోషులకు ఒకరి తర్వాత ఒకరు పిటిషన్ వేస్తూ న్యాయపరమైన, చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకుంటూ ఉరిశిక్షను వాయిదా వేస్తూ రావటం జరిగింది.

జనవరి 22న ఉదయం 6 గంటలకు మొదటి వీరికి ఉరిశిక్ష అమలు కావాల్సివుంది. కానీ అప్పటి నుంచి 
ఒకరి తర్వాత ఒకరు మెర్సీ పిటిషన్, క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేస్తూ రావడంతో ఉరిశిక్ష వాయిదా పడుతూ వచ్చింది. జనవరి 22న, ఫిబ్రవరి1, అలాగే మార్చి 3న డెత్ వారెంట్ వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా పవన్ కు సంబంధించి క్యురేటివ్, మెర్సీ పిటిషన్ రిజెక్టు అయింది. అలాగే అక్షయ్ కు సంబంధించి రెండోసారి మెర్సీ పిటిషన్ ఫైల్ చేశారు. అది పెండింగ్ లో ఉందన్న అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా ఈరోజు మరో డెత్ వారెంట్ ను జారీ చేశారు.

దోషుల తరపు న్యాయవాది మాత్రం తన ప్రయత్నాలను ఆపుతున్నట్లు లేదు. ఎందుకంటే పవన్ కు సంబంధించి రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడం పట్ల సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయని ఏపీ సింగ్ చెబుతున్నారు. నాలుగో డెత్ వారెంట్ అయినా అమలు అవుతుందా? మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలవుతుందా.. లేదా.. అనేది వేచి చూడాల్సివుంది.