నిర్భయ దోషులు దేశం సహనాన్ని పరీక్షిస్తున్నారు..హైకోర్టులో కేంద్రం

  • Published By: venkaiahnaidu ,Published On : February 2, 2020 / 02:15 PM IST
నిర్భయ దోషులు దేశం సహనాన్ని పరీక్షిస్తున్నారు..హైకోర్టులో కేంద్రం

నిర్భయ కేసులో కేంద్రం పిటిషన్ పై ఇవాళ(ఫిబ్రవరి-2,2020)ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధింపుపై స్టే విధిస్తూ శుక్రవారం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ లో ఉంచింది హైకోర్టు. సోమవారం(ఫిబ్రవరి-2,2020) ఉదయం 10గంటలకు కోర్టు తీర్పు వెలువరించనుంది. 

దోషులకు వీలైనంత త్వరగా ఉరిశిక్ష విధించాలని కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుని కోరారు. ఇలాంటి దోషులకు శిక్షలో ఆలస్యం అనేది న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని షేక్ చేస్తుందని తుషార్ వాదించారు. నలుగరు దోషుల్లో ఇద్దరికి చట్టపరమైన ఆఫ్షన్స్ అన్ని ముగిశాయని,వారి క్షమాబిక్ష పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయని,కనుక వారిద్దరినీ ఉరితీసేందుకు తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ కోర్టుని కోరారు. చట్టంలో ఉన్న లొసుగులును ఉపయోగించుకుంటూ నలుగురు దోషులు దేశం సహనాన్ని పరీక్షిస్తున్నారని సొలిసిటర్ జనరల్ కోర్టుకి తెలిపారు.

శిక్ష యొక్క లక్ష్యాన్ని నిరాశపరిచేందుకు దోషులు సమిష్టిగా వ్యవహరిస్తున్నారని, నిందితుడు పవన్ గుప్తా అన్ని రకాల పిటిషన్లు కోర్టుల్లో వేస్తున్నాడు కానీ క్షమాబిక్ష పిటిషన్ ఫైల్ చేయడం లేదని తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మరో దోషి అయిన ముఖేష్ తన ఏడవ చట్టపరమైన విచారణను జనవరి 31 న దాఖలు చేశారు. అప్పటి వరకు అతను తన క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చేయలేదని కేంద్రం వాదించింది. ఇది ఉద్దేశపూర్వకంగా ఉరిశిక్షను ఆలస్యం చేయడమేనని తుషార్ మెహతా తెలిపారు. ఇలాంటి దోషులకు శిక్షలో ఆలస్యం అనేది న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని షేక్ చేస్తుందని తుషార్ వాదించారు.

అయితే చట్టంలో ఉన్న దోషులకు నేరస్థులు ఏం చేస్తారని దోషుల తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. దోషులకు మరిన్ని పిటిషన్లు వేసుకునేందుకు అవకాశాలివ్వాలని దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ కోర్టుని కోరారు. అయితే ఒక కేసులో ఒక దోషి పెండింగ్ లో ఉన్నప్పుడు మిగిలిన వారిని ఉరితీయకూడదని రూల్స్ నిర్దేశిస్తున్నాయని నిందితుల తరపు లాయర్ వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు తీర్పుని రిజర్వ్ లో ఉంచింది.

ఫిబ్రవరి-1 ఉదయం 6గంటలకు నలుగురు నిందితులను ఉరితీయాలంటూ జనవరి17,2020న ట్రయల్ కోర్టు రెండోసారి బ్లాక్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు నిందితులను జనవరి-22,2020న ఉరితీయాలంటూ జనవరి-7,2020న కోర్టు బ్లాక్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. క్షమాబిక్ష పిటిషన్ తిరస్కరించడం మరియు ఉరిశిక్ష మధ్య ఒక దోషికి 14 రోజులు గడువు ఉండాలని నిబంధనలు కోరుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే వినయ్,అక్షయ్ లు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పవన్ ఇంకా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. దోషుల క్యూరేటివ్ పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టివేసిన తరువాత మాత్రమే అధ్యక్షుడి ముందుకు క్షమాబిక్షపిటిషన్ వచ్చే అవకాశముంటది.

దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక దారుణ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.