India On Sale : రాహుల్ గాంధీపై నిర్మలా సీతారామన్ ఫైర్

ప్ర‌జాధ‌నంతో గ‌త ప్ర‌భుత్వాలు 70 ఏళ్లుగా నిర్మించిన ప్ర‌తిష్టాత్మ‌క ఆస్తుల‌ను జాతీయ న‌గ‌దీక‌ర‌ణ ప్ర‌ణాళిక(National Monetisation Pipeline)పేరుతో తెగ‌న‌మ్మే ప్ర‌క్రియ‌ను మోదీ సర్కార్

India On Sale : రాహుల్ గాంధీపై నిర్మలా సీతారామన్ ఫైర్

Nirmala Rahul

India On Sale ప్ర‌జాధ‌నంతో గ‌త ప్ర‌భుత్వాలు 70 ఏళ్లుగా నిర్మించిన ప్ర‌తిష్టాత్మ‌క ఆస్తుల‌ను జాతీయ న‌గ‌దీక‌ర‌ణ ప్ర‌ణాళిక(National Monetisation Pipeline)పేరుతో తెగ‌న‌మ్మే ప్ర‌క్రియ‌ను మోదీ సర్కార్ చేప‌ట్టింద‌ని మంగళవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే బుధవారం కూడా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ రాహుల్ గాంధీ ఓ ట్వీట్ లో.. ముందుగా దేశ గౌర‌వాన్ని అమ్మేసిన ప్ర‌భుత్వం ఇప్పుడు భార‌త్‌ను అమ్మ‌కానికి పెట్టింద‌ని పేర్కొన్నారు. అమ్మకానికి భారత్(#IndiaOnSale)అని రాహుల్ తన ట్విట్టర్ పోస్ట్ లో పేర్కొన్నారు.

అయితే రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ తీవ్రంగా స్పందించారు. దేశంలోని వనరులను అమ్మేసి, ముడుపులు తీసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. బుధవారం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ..మానెటైజేషన్ అంటే ఏమిటో రాహుల్ గాంధీకి అర్థమవుతుందా? దేశంలోని వనరులను అమ్మేసి, ముడుపులు పుచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. 2008లో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేను కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం మానెటైజ్ చేసి రూ.8,000 కోట్లు సేకరించిందన్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదన చేసింది యూపీయే ప్రభుత్వమేనని చెప్పారు. కామన్వెల్త్ గేమ్స్‌ సమయంలో జరిగిన అవినీతిని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.

మానెటైజేషన్ అంటే ఆస్తులను అమ్మడం కాదని.. ఆస్తులను తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారన్నారు. ఇవి పూర్తయిన బ్రౌన్‌ఫీల్డ్ అసెట్స్ అని, అయితే వీటి వినియోగం తక్కువగా ఉందని అన్నారు. వీటిని పరిపూర్ణంగా వినియోగంలోకి తేవడం కోసం మానెటైజేషన్ ప్రక్రియను అనుసరిస్తున్నామన్నారు.

కాగా, దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల సమీకరణలో భాగంగా జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్‌(NMP)ని సోమవారం నిర్మలాసీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న నాలుగేళ్లలో ఈ కార్యక్రమం కింద 6 లక్షల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం సమీకరించనుంది. రైల్వే, రోడ్లు, విద్యుత్‌ రంగాల్లో ఆస్తులను నిర్దిష్ట కాలానికి విక్రయించడం ద్వారా ఈ నిధుల సమీకరణ చేస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియాలు, మరికొన్ని సంస్థల అభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తారు. కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

దేశ సంప‌ద‌ను మోదీ స‌ర్కార్ కొద్దిమంది బ‌డా సంప‌న్నుల‌కు దోచిపెడుతున్నార‌ని, కార్పొరేట్ స్నేహితుల‌కు ల‌బ్ధి చేకూర్చేందుకే మోదీ ప్ర‌భుత్వం ఎన్ఎంపీని ముందుకుతెచ్చింద‌ని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. బుధవారం రాహుల్ గాంధీ ఓ ట్వీట్ లో.. ముందుగా దేశ గౌర‌వాన్ని అమ్మేసిన ప్ర‌భుత్వం ఇప్పుడు భార‌త్‌ను అమ్మ‌కానికి పెట్టింద‌ని కేంద్రాన్ని విమర్శించారు. అమ్మకానికి భారత్(#IndiaOnSale)అని రాహుల్ తన ట్విట్టర్ పోస్ట్ లో పేర్కొన్నారు.

READ Rahul Gandhi : 70ఏళ్లుగా నిర్మించిన ఆస్తులన్నీ తెగనమ్ముతున్నారు..మోదీ సర్కార్ పై రాహుల్ ఫైర్