కొడుకు 9th బర్త్ డే..రూ.9 కోట్ల కారు గిప్ట్ ఇచ్చిన తండ్రి : భారతీయ బిలియనీర్ల లగ్జరీ లైఫ్ స్టైల్

కొడుకు 9th బర్త్ డే..రూ.9 కోట్ల కారు గిప్ట్ ఇచ్చిన తండ్రి : భారతీయ బిలియనీర్ల లగ్జరీ లైఫ్ స్టైల్

Indian billionaires spent their money : డబ్బున్నవాళ్లు ఏం చేసినా..ఏది కొన్నా ఘనంగానూ..దర్పంగానూ ఉంటుంది. వారి వారి స్థాయిలను బట్టి వారు కొనే వస్తువుల రేంజ్ ఉంటుంది. అటువంటి ఓ ప్రత్యేక బ్యాగ్ గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. సాధారణంగా ఆడవారికి హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ వాడటానికి ఇష్టపడుతుంటారు. అలా వారి వారి అభిరుచులు..బడ్జెట్ ను బట్టి బ్యాగ్స్ కొంటుంటారు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాగులకే కేవలం బిలియనీయర్లు మాత్రమే కొంటారు. ఆ బ్యాగుల్లో వాళ్లు ఏం పెట్టుకుంటారు అనేది పెద్ద విషయంకాదు..కానీ..ఆ హ్యాండ్ బ్యాగ్ మాత్రం వారి రేంజ్ ను తెలిపేదిగా ఉంటుంది.అటువంటి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ హ్యాండ్ బ్యాగ్‌ ప్రత్యేకతలు అవి ఎవరు కొన్నారు? వాటి ఖరీదు ఎంత అనే విషయాలు తెలుసుకుందాం..అంతేకాదు భారతీయ బిలియనీర్లు ఖర్చు పెట్టి కొన్న కొన్ని వస్తువుల గురించి తెలుసుకుందాం..

నీతా అంబానీ కాస్ట్లీ బ్యాగ్..
సాధారణంగా హ్యాండ్ బ్యాగ్‌లు కొనాలంటే వారి వారి స్థాయిలను బట్టి కొంటుంటారు. అలా రూ.1000 ఉంటేనే ‘వామ్మో అంత ఖరీదా?’ అంటాం. కానీ మనం ఊహించని రేంజ్ కాస్ట్లీ బ్యాగు గురించి తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. భారత వాణిజ్య దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్శన్ నీతా అంబానీ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు అక్షరాలా.. 2.6 కోట్లు..!! అదేదో అత్యంత కాస్ట్లీ లెదర్ తో చేసింది అనుకుంటే పొరపాటే..బంగారంతో పాటు వజ్రాలతో తయారు చేసారీ బ్యాగ్ ను. రూ.2.6 కోట్లు విలువ చేసేంత ప్రత్యేకత ఆ బ్యాగు విశేషాలేమా? అని ఆలోచిస్తున్నారా? రూ.2.6 కోట్ల ఖరీదైన ఈ బ్యాగుని 18 క్యారెట్ల బంగారం..240కి పైగా వజ్రాలతో తయారుచేశారు. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పోస్ట్ చేసిన ఓ ఫొటోలో నీతా అంబానీ ‘హెర్మెస్ హిమాలయ బిర్కిన్ బ్యాగ్’తో లుక్ ఇచ్చారు.

నీతా అంబానీ బుల్లెట్ ప్రూఫ్ కార్..
ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కారు కూడా ప్రత్యేకమైనదే. పైగా ఖరీదైనదీ కూడా. ఆమె బట్టల నుంచి అన్నీ లగ్జీరీగానే ఉంటాయి. ప్రపంచ బిలియనీయర్లలో ఒకరదైన ముఖేష్అంబానీ భార్యకు ఆ మాత్రం రేంజ్ఉంటుందిగా..పైగా 2.6 కోట్లు ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ కలిగిన ఆమెకు ఆ రేంజ్ కారు లేకుంటా ఎలా? నీతా అంబానీ సేఫ్టీ కోసం Mercedes S-Guard కారు బుల్లెట్ ప్రూఫ్. సూపర్ సేఫ్ మార్క్ . అంబానీ కార్లలో ఈ Mercedes S-Guard ప్రత్యేకమైనది. దీని ఖరీదు రూ.10 కోట్లు. మరిన్ని ప్రత్యేకతలు సంతరించుకుని రూ.12 నుంచి 13 కోట్లు..

కుమారుడికి బాట్ మొబైల్ కారు కొనిచ్చిన మరో బిలియనీయర అదర్ పూనవల్లా
సీరం ఇన్స్టిట్యూట్ సీఈవో అదర్ పూనవల్లా తనకొడుకు 9వ పుట్టినరోజు కానుకగా..రూ.9 కోట్లు ఖర్చు పెట్టి..బాట్ మొబైల్ కారు కొనిచ్చారు. బ్యాట్ మొబైల్ కారు అంటే వాహనప్రియులకు ఓ స్పెషల్ ఎట్రాక్షన్.

విరాట్ కోహ్లీ..వాటర్
విరాట్ కోహ్లీ..పరిచయం అవసరం లేని పేరు. క్రికెట్ దిగ్గజం. స్టైల్ కో బ్రాండ్. అటువంటి విరాట్ కోహ్లీ ప్రపంచ ధనవంతుల క్రీడాకారుల్లో ఒకరు. మంచి ఫిట్ నెస్ తో ఎప్పుడూ మాంచి యాక్టివ్ గా ఉండటం విరాట్ కోహ్లీ స్పెషల్. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వ్యక్తి విరాట్. పూర్తి శాఖాహారి. విరాట్ కోహ్లీ తాగే వాటర్ లీటరు రూ.600లు. అలా విరాట్ తాగే వాటర్ కు సంవత్సరానికి రూ.4,38,000లు ఖర్చు అవుతాయి.