Nithyananda : కైలాశ ద్వీపానికి రావొద్దు..నిత్యానంద సూచన

తాను ఏర్పాటు చేసిన కైలాశ ద్వీపానికి రావొద్దని భారతీయులకు సూచన చేస్తున్నారు వివాస్పద మత గురువు నిత్యానంద స్వామి చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Nithyananda : కైలాశ ద్వీపానికి రావొద్దు..నిత్యానంద సూచన

Nithyananda

Kailasa : తాను ఏర్పాటు చేసిన కైలాశ ద్వీపానికి రావొద్దని భారతీయులకు సూచన చేస్తున్నారు వివాస్పద మత గురువు నిత్యానంద స్వామి చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ఆధీనంలో ఉన్న ఈ ద్వీపానికి అనుమతిని నిరాకరిస్తున్నట్లు తెలిపారు. పలు దేశాల్లో కరోనా విజృంభిస్తోందని, దీంతో తన దేశాన్ని రక్షించుకొనేందుకు ఈ ప్రకటన చేస్తున్నట్లు, భారత్‌, బ్రెజిల్, ఐరోపా సంఘం, మలేసియా దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు తన ప్రెసిడెన్షియల్ మ్యాండేట్‌లో ప్రకటించారు. భారతదేశంలో కరోనా కేసులు ఎక్కువవుతున్న క్రమంలో పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, భారతదేశంలో పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి కైలాశ దేశాన్ని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. నిత్యానంద తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారనేది తెలిసిందే. తిరువన్నమలైకి చెందిన ఇతనిపై కిడ్నాప్, హత్య, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వామి నిత్యానందపై బెంగళూరుకు చెందిన జనార్దన్‌ శర్మ గుజరాత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పట్లో. శర్మ తన ఇద్దరు కుమార్తెలను కిడ్నాప్‌ చేసి అహ్మదాబాద్‌ ఆశ్రమంలో నిర్బంధించారంటూ చేసిన ఫిర్యాదుతో నిత్యానందపై కిడ్నాప్‌ కేసు నమోదైంది. వరుస కేసుల క్రమంలో నిత్యానంద విదేశాలకు పరారయ్యాడు.

కిడ్నాప్‌ కేసులో గుజరాత్‌ పోలీసులు అంతర్జాతీయ పోలీసుల (ఇంటర్‌పోల్‌) సాయం కోరారు. అయినప్పటికీ అతను ఉన్న ప్రాంతాన్ని గుర్తించలేకపోయారు. ఓ ప్రాంతానికి వెళ్లి..తనది సొంత కైలాశ దేశంగా ప్రకటించుకున్నాడు. ఆ దేశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన యూ ట్యూబ్ ద్వారా వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు. హిందూ దేశాలతో తాను వ్యాపారం చేయనున్నట్లు ప్రకటించారు. 2020, ఆగస్టు 22వ తేదీ వినాయక చవితి రోజున ప్రారంభిస్తానని చెప్పినట్లుగానే కైలాస దేశానికి చెందిన నాణేలను కూడా విడుదల చేయడం విశేషం. ఆర్బీకే నాణేలు బంగారంతో చేసినవంటూ..ఆయన చెప్పారు. కైలాస దేశం కరెన్సీ అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందని వెల్లడించారు. ఓ దేశంతో చట్టబద్దంగా ఎంవోయూ కుదుర్చుకున్నట్లు స్పష్టం చేస్తున్నారు. కానీ ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నారో ప్రకటించలేదు.

Read More : Proning : ఆక్సిజన్ అందడం లేదా, ప్రోనింగ్ అంటే ఏమిటీ ?..ఆక్సిజన్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది