SDG India Index: సుస్థిర ఆర్థికాభివృద్ధి..నీతి ఆయోగ్ ర్యాంకుల్లో కేరళ టాప్

సుస్థిర ఆర్థికాభివృద్ధిలో 2020–21కు సంబంధించి రాష్ట్రాల వారీగా ర్యాంకులను గురువారం నీతి ఆయోగ్‌ విడుదల చేసింది.

SDG India Index: సుస్థిర ఆర్థికాభివృద్ధి..నీతి ఆయోగ్ ర్యాంకుల్లో కేరళ టాప్

Sdg India Index

SDG India Index సుస్థిర ఆర్థికాభివృద్ధిలో 2020–21కు సంబంధించి రాష్ట్రాల వారీగా ర్యాంకులను గురువారం నీతి ఆయోగ్‌ విడుదల చేసింది. నీతి ఆయోగ్ వైస్‌ చైర్మన్ రాజీవ్ కుమార్‌ విడుదల చేసిన SGD ఇండియా ఇండెక్స్ 2020-21 ప్రకారం…మొత్తం 100 పాయింట్లకు గాను..75 పాయింట్లతో కేరళ మరోసారి అగ్రస్ధానంలో నిలిచింది. హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు 74 పాయింట్లతో రెండవ స్ధానాన్ని దక్కించుకున్నాయి.

72 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఏపీ నిలిచింది. గతేడాదితో పోలిస్తే 5 పాయింట్లు అధికంగా సాధించింది ఆంధ్రప్రదేశ్. క్లీన్‌ ఎనర్జీ విభాగంలో ఏపీ టాప్‌ ర్యాంక్‌ సాధించగా, ఓవరాల్‌గా ఫ్రంట్‌ రన్నర్‌ రాష్ట్రాల జాబితాలో ఏపీ నిలిచింది. ఇక,52,56,57 పాయింట్లతో బీహార్‌, జార్ఖండ్‌, అస్సాం రాష్ట్రాలు చెత్త ప్రదర్శనతో అట్టడుగున నిలిచాయి.

కాగా, రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెంచేందుకు మూడేళ్లుగా నీతి ఆయోగ్‌ ఈ సూచీ ర్యాంకుల్ని విడుదల చేస్తోంది. 2018 డిసెంబర్‌లో నీతిఆయోగ్‌ తొలిసారి ఈ ర్యాంకుల్ని విడుదల చేసింది. ఏటా నీతి ఆయోగ్‌ ప్రకటించే సమీకృతాభివృద్ధి లక్ష్యాల సూచీ.. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సామాజిక, ఆర్ధిక, పర్యావరణ అభివృద్ధి, పురోగతి ఎలా ఉందో చూపిస్తుంటుంది.

రాష్ట్రాలు సమీకృతాభివృద్ధి లక్ష్యాల్ని సమీక్షించేందుకు ప్రాధమికంగా ఈ ర్యాంకులు ఉపయోగపడటమే కాకుండా… అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించేందుకు ఆయా రాష్ట్రాలకు ఈ సూచీలు ఉపయోగపడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సహకారంతో భారత్‌లో నీతి ఆయోగ్ ఈ ర్యాంకులు ప్రకటిస్తోంది. అంతర్జాతీయంగా పోటీ పడే స్ధాయిలో రాష్ట్రాల్ని ఉంచేందుకు ఈ సూచీలో ఇచ్చిన లక్ష్యాలు ఉపయోగపడతాయని నీతి ఆయోగ్‌ చెబుతోంది.