Delhi-Mumbai Expressway: అమెరికా గొప్పతనం వెనుక ఉన్న సీక్రెట్ వెల్లడించిన నితిన్ గడ్కరీ

మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే పెట్టుబడులు పెరిగి కంపెనీలు వస్తాయని, అలా వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని గడ్కరి అన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‭ప్రెస్‭వే కోసం వేలాది మంది పని చేశారని, వారి కృషి దేశాభివృద్ధిలో నిలిచిపోతుందని గడ్కరి కొనియాడారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎక్స్‭ప్రెస్‭వేగా ఢిల్లీ-ముంబై ఎక్స్‭ప్రెస్‭వే నిలవనుందని, ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశ ముఖచిత్రం మారుతుందని గడ్కరి అన్నారు.

Delhi-Mumbai Expressway: దేశానికి తలమానికంగా భావిస్తున్న ఢిల్లీ-ముంబై ఎక్స్‭ప్రెస్‭వేను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించారు. రాజస్థాన్‭లోని దౌసాలో కేంద్ర రోడ్డు-రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో కలిసి ఈ రోడ్డును ప్రారంభించారు. అయితే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి జైపూర్ వరకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 246 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే ప్రారంభమైంది. ఇది ఢిల్లీ-ముంబై ఎక్స్‭ప్రెస్‭వే మొదటి దశగా చెబుతున్నారు.

Turkey Earthquake: టర్కీలో భూకంపం.. ఆస్పత్రిలో శిశువుల్ని కాపాడేందుకు నర్సులు ఏం చేశారంటే?

ఈ సందర్భంగా అమెరికా అభివృద్ధి వెనుక ఉన్న రహస్యాన్ని రహస్యాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. అమెరికా అభివృద్ధి వెనుక మంచి రోడ్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ విషయాన్ని ఒకానొక సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘అమెరికా అభివృద్ధి గురించి ఆ దేశ మాజీ అధినేత జాన్ ఎఫ్ కెనడీ ఒక మాట చెప్పారు. అమెరికా అభివృద్ధి చెందింది కాబట్టి, రోడ్డు బాగుండడం కాదు. అమెరికా రోడ్లు బాగుండడం వల్లే అమెరికా అభివృద్ధి చెందిందని అన్నారు. మా ప్రభుత్వం సైతం ఆ వైపుకు దూసుకెళ్తోంది. దేశంలో మౌలిక సదుపాయాల్ని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం’’ అని గడ్కరి అన్నారు.

Delhi-Mumbai Expressway: నవ శకానికి నాంది.. ఢిల్లీ-ముంబై ఎక్స్‭ప్రెస్‭వే (మొదటి దశ) ప్రారంభించిన ప్రధాని మోదీ

మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే పెట్టుబడులు పెరిగి కంపెనీలు వస్తాయని, అలా వస్తే ఉద్యోగాలు పెరుగుతాయని గడ్కరి అన్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‭ప్రెస్‭వే కోసం వేలాది మంది పని చేశారని, వారి కృషి దేశాభివృద్ధిలో నిలిచిపోతుందని గడ్కరి కొనియాడారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎక్స్‭ప్రెస్‭వేగా ఢిల్లీ-ముంబై ఎక్స్‭ప్రెస్‭వే నిలవనుందని, ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశ ముఖచిత్రం మారుతుందని గడ్కరి అన్నారు.

ట్రెండింగ్ వార్తలు