బీహార్ లో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ…కూటమి కొంప ముంచిన కాంగ్రెస్

  • Published By: venkaiahnaidu ,Published On : November 11, 2020 / 07:00 AM IST
బీహార్ లో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ…కూటమి కొంప ముంచిన కాంగ్రెస్

Nitish Kumar, BJP Retain Bihar, Tejashwi Yadav’s RJD Single-Largest Party బీహార్​ ఎన్నికల్లో మహాకూటమి గెలవకపోయినప్పటికీ…ఎన్నికల సమరంలో తేజస్వీ ముద్ర స్పష్టంగా కనపడింది. పార్టీల పరంగా చూస్తే, రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీగా ఆర్జేడీ నిలిచింది. ఆర్జేడీ 75స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక,బీజేపీ 74స్థానాల్లో విజయం సాధించింది. జేడీయూ 43స్థానాల్లో విజయం సాధించింది.



కాంగ్రెస్ పార్టీ 70స్థానాల్లో పోటీ చేసి 19స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వామపక్షాలు 16స్థానాల్లో విజయం సాధించాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం అనూహ్యంగా 5స్థానాల్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక,ఎన్డీయే నుంచి బయటికొచ్చి సొంతంగా పోటీ చేసిన ఎల్జేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. ఇతరులు 7చోట్ల విజయం సాధించారు.

ఇక ఓట్ల శాతం విషయానికొస్తే,ఎన్డీయే కూటమికి 38.4శాతం ఓట్లు రాగా,మహాకూటమికి 37.3శాతం ఓట్లు వచ్చాయి. ఎల్జేపీకి 5.6శాతం ఓట్లు,ఇతరులకు 18.7శాతం ఓట్లు వచ్చాయి. పార్టీల పరంగా చూస్తే,అత్యధికంగా ఆర్జేడీకి 23.03శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో అత్యధిక ఓట్లు గెల్చుకున్న పార్టీగా ఆర్జేడీ నిలిచింది.
https://10tv.in/tejashwi-yadavs-party-single-largest-in-bihar/



మొత్తంగా ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 122ని దాటి దూసుకెళ్లింది ఎన్డీయే కూటమి. ఎన్డీయే కూటమి 125స్థానాల్లో విజయం సాధించగా,మహాకూటమి110 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ చతికిలపడటం.. కూటమిని నిండా ముంచింది. రాష్ట్రాన్ని 15ఏళ్ల పాటు పాలించిన నితీశ్​కుమార్​..ఎన్డీయే విజయంతో ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.