జేడీయూ కొత్త అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్

జేడీయూ కొత్త అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్

RCP Singh chosen new president of JD(U) జనతా దళ్​ యునైటెడ్​(జేడీయూ)లో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. జేడీయూ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ రాజ్యసభ్య సభ్యుడు ఆర్సీపీ సింగ్ ఎంపికయ్యారు. జేడీయూ అధ్యక్షుడుగా 2019లో తిరిగి ఎన్నికైన నితీశ్ కుమార్ పదవీకాలం పూర్తవడంతో ఈ రోజు తప్పుకున్నారు. ఆదివారం జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పార్టీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు. జేడీయూ మండలి సమావేశంలో ఆర్సీపీ సింగ్​ పేరును సీఎం నితీశ్​ స్వయంగా ప్రతిపాదిస్తూ తీర్మానం చేసినట్టు తెలుస్తోంది. అనంతరం నితీశ్​ తీర్మానానికి ఏకగీవ్రంగా ఆమోదం లభించినట్టు సమాచారం.

ఆర్సీపీ సింగ్ ఇప్పటివరకు జేడీయూ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. నితీశ్​ కుమార్​కు ఆర్సీపీ సింగ్ అత్యంత సన్నిహితుడు. ఇటీవల జరిగిన బిహార్​ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఫలితాలు, అరుణాచల్​ప్రదేశ్​లో పార్టీని వీడి ఆరుగురు ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకొన్న నేపథ్యంలో జేడీయూ అధ్యక్షుడి మార్పు అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.

పార్టీ భవిష్యత్తు గురించి, దేశంలో సంభవిస్తున్న రాజకీయ మార్పులను గురించి ఇవాళ జరిగిన సమావేశంలో జేడీయూ ముఖ్య నేతలు చర్చించారు. ఈ సమావేశం అనంతరం రెండు రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూ ఎమ్మెల్యేలు 6గురు బీజేపీలో చేరడంపై మీడియాతో మాట్లాడిన జేడీయూ నేత కేసీ త్యాగి..కూటమి రాజకీయాల్లో సరైన పద్ధతి కాదని, ఇలాంటివాటిని తాము ఆమోదించమని త్యాగి అన్నారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్యెల్యేల బీజేపీ తమలో చేర్చుకోవడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు.

మరోవైపు, వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న వెస్ట్ బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు జేడీయూ సిద్దమైంది. పోటీ చేసేందుకు ఇప్పటికే 75 స్థానాలను గుర్తించినట్లు పార్టీ బెంగాల్​ నేతలు ప్రకటించారు.