Caste-Based Census : ఉమ్మడి డిమాండ్..మోదీతో భేటీ కానున్న నితీష్,తేజస్వీ

బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనుంది.

Caste-Based Census : ఉమ్మడి డిమాండ్..మోదీతో భేటీ కానున్న నితీష్,తేజస్వీ

Bihar

Caste-Based Census బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనుంది. కులాలవారీగా జనాభా గణన డిమాండ్ పై ప్రధానిని కలవనున్న బృందంలో నీతీష్ సర్కార్ పై నిత్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ..సోమవారం ఉదయం 11 గంటలకు అపాయింట్ మెంట్ ఇచ్చారని..ప్రతినిధి బృందం యొక్క మొత్తం జాబితా ప్రధానికి మరియు సమావేశానికి వెళ్తున్న పది పార్టీల సభ్యులకు కూడా పంపబడిందని ఇవాళ పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం నితీష్ కుమార్ అన్నారు.

ప్రస్తుతానికి,కులాల వారీగా జనాభా గణన చేపట్టాలనే తాము ప్రధానిని కోరనున్నామని..అయితే అది నిర్ణయించాల్సింది కేంద్రమేననినితీష్ కుమార్ తెలిపారు. మొత్తం దేశమంతా కులాల వారీగా జనాభా గణన నిర్వహిస్తే, అది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నితీష్ అన్నారు. ఈ డిమాండ్ దేశంలోని ప్రతిచోటా ఉందన్నారు.

కాగా,ఈ అఖిలపక్ష బృందం మోదీని కలవాలనే ఆలోచనను మొదట తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ కూటమి ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే కుల ఆధారిత జనాభా గణనను అంశాన్ని విస్మరించకూడదని బీజేపీ కూడా భావిస్తున్నట్లు నితీష్ బృందాని మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడం ద్వారా సృష్టమవుతోంది.
అయితే కేంద్ర ప్రభుత్వం అటువంటి జనాభా గణనను నిర్వహించకపోతే.. బీహార్‌లో కుల డేటాను లెక్కించడానికి ఒక కసరత్తు చేయడంతో రాష్ట్రంలో చర్చను ప్రారంభించే అవకాశముందని ఆగస్టు 9న నితీష్ కుమార్ అన్న విషయం తెలిసిందే ఈ విషయంపై ప్రధానికి రాసిన లేఖకు ఎలాంటి స్పందన రాకపోవడంతో కొన్ని రోజుల తర్వాత నితీష్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఈ సమయంలో నితీష్ కుమార్ ని ప్రధాని మోదీ అవమానిం