Bihar Politics: కొవిడ్ కలిపింది ఇద్దరిని..! కొవిడ్‌తో బాధపడుతున్న సోనియాను పరామర్శించేందుకు నితీష్ ఫోన్.. బీహార్‌లో తారుమారైన ప్రభుత్వాలు ..

బీహార్ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. బీజేపీ, జేడీ(యూ) ప్రభుత్వం కాస్త.. కొద్ది రోజుల వ్యవధిలోనే జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిపి మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎనిమిదవ సారి సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.

Bihar Politics: కొవిడ్ కలిపింది ఇద్దరిని..! కొవిడ్‌తో బాధపడుతున్న సోనియాను పరామర్శించేందుకు నితీష్ ఫోన్.. బీహార్‌లో తారుమారైన ప్రభుత్వాలు ..

Nitish Kumar and Soniya gandi

Bihar Politics: బీహార్ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. బీజేపీ, జేడీ(యూ) ప్రభుత్వం కాస్త.. కొద్ది రోజుల వ్యవధిలోనే జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిపి మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఎనిమిదవ సారి సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇదంతా పెద్దగా హడావుడి లేకుండానే జరిగిపోయింది. గత నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంకు బీహార్ సీఎం నితీష్ హాజరుకాక పోవటంతో బీజేపీ, జేడీ(యూ) మధ్య పొసగడం లేదన్న విషయం బయటకొచ్చింది. అలాంటిదేమీ లేదని బీజేపీ చెబుతున్నప్పటికీ నాలుగు రోజుల వ్యవధిలోనే నితీష్ కుమార్ బీజేపీకి షాకిస్తూ ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్ రాష్ట్రంలో ఇంతపెద్ద మార్పుకు కారణం ఒక్క ఫోన్ కాల్. కరోనాతో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని పరామర్శించేందుకు నితీష్ కుమార్ మర్యాద పూర్వకంగా ఫోన్ చేశారు. బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అక్కడే బీజం పడిందట..

Bihar New Government: బీహార్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. సీఎంగా నితీష్, డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌ ప్రమాణ స్వీకారం

బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు వెనుక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్క్రీన్ ప్లే ఉన్నట్లు తెలుస్తోంది. సోనియాగాంధీ కొవిడ్‌తో ఇబ్బంది పడుతున్న సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మర్యాదపూర్వకంగా పరామర్శించేందుకు ఫోన్ చేశారు. సోనియాగాంధీ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో సోనియాగాంధీ మాట్లాడుతూ.. బీహార్‌లో పాలన ఎలా సాగిస్తున్నారు అంటూ ప్రస్తావించారట.. సభాషణలో భాగంగా తన మిత్రపక్షం బీజేపీ తనపై ఒత్తిడి తెస్తుందని, జేడీ(యూ)ను విచ్ఛిన్నం చేయడానికి, తమ ప్రభావాన్ని తగ్గించేందుకు బీజేపీ అగ్ర నాయకత్వం కుట్ర చేస్తుందంటూ సోనియా వద్ద నితీష్ ప్రస్తావించినట్లు తెలిసింది.

Prashant Kishor on Bihar crisis: నితీష్ నిర్ణయం జాతీయ రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపదు..

ఇదే సమయంలో బీహార్‌లో మార్పుకోసం మీరు సహకరించాలని సోనియాను నితీష్ కోరారట. దీంతో రాహుల్ గాంధీని కూడా సంప్రదించాలని సోనియా నితీష్ కు సూచించినట్లు తెలిసింది. అయితే రాహుల్ గాంధీని సంప్రదించే బాధ్యతను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు నితీష్ అప్పగించారు. తేజస్వి వెంటనే రాహుల్ ను సంప్రదించి విషయాన్ని వివరించాడు. అందుకు అంగీకరించిన రాహుల్.. మీకు ఏదైనా సహాయం కావాలంటే రాష్ట్ర పార్టీ ఇంఛార్జి భర్త చరణ్ దాస్‌తో టచ్‌లో ఉండండి అంటూ సూచించారట.

Bihar Deputy CM బిహార్ డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్.. ఆర్‌జేడీకి జాక్‌పాట్!

ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పార్టీల నేతలతో చర్చలు జరగడం, ప్రభుత్వ మార్పుకు స్క్రిప్ట్ సిద్ధమవ్వటం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఒక్క కాంగ్రెస్, ఆర్జేడీనే కాక వామపక్షాలు, ఇతరులను ప్రభుత్వంలో భాగస్వాములను చేయాలని భావించారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎంతకైనా తెగిస్తుందని, ఆ అవకాశం లేకుండా చేయాలంటే అందరిని కలుపుకొని పోయేలా ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే.. బీజేపీ, నితీష్ కుమార్‌కు మధ్య ఉన్న విబేధాలకు కారణం.. బీహార్ ముఖ్యమంత్రి దేశ ఉపరాష్ట్రపతి కావాలనే కోరికతో ముడిపడి ఉంటుందని బీజేపీ నాయకుడు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ విమర్శించారు.

Bihar Politics : కమలానికి దూరమవుతున్న మిత్రపక్షాలు..బీజేపీకి నితీష్ బ్రేకప్‌ స్టోరీస్‌ వెనక భారీ వ్యూహం ఉందా..?

నితీష్ కుమార్ 2013లో బీజేపీతో తెంచుకోవడానికి ముందు చాలా కాలంగా బీజేపీ మిత్రపక్షంగానే ఉన్నారు. ఆ తర్వాత 2017లో మళ్లీ బీజేపీతో చేతులు కలిపాడు. 2020 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నిక్లలో జేడీ(యూ), బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేశాయి. బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని నితీష్ కుమార్ కే కట్టబెట్టింది.