Shankar Mishra: విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు బెయిల్ తిరస్కరించిన కోర్టు

కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవడంతో ఎయిర్ ఇండియా తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఢిల్లీలో విమానం దిగగానే మిశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు

Shankar Mishra: విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు బెయిల్ తిరస్కరించిన కోర్టు

No Bail For Man Who Peed On Woman On Flight

Shankar Mishra: ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. మిశ్రా పట్టుకున్న దరఖాస్తును బెయిల్‌ను పరిశీలించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్ గార్గ్.. బెయిల్‌ ఇవ్వడం సరికాదని తోసిపుచ్చారు. మిశ్రా చేసిన చర్య చాలా క్రూరమైదనదని ధర్మాసనం పేర్కొంది. కాగా, పోలీసుల కస్టడీని నిరాకరిస్తూ మిశ్రాను 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు మెజిస్టీరియల్ కోర్టు శనివారమే పంపింది.

Uppal Stadium: 18న ఉప్పల్‌లో వన్డే మ్యాచ్.. 13 నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం

కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవడంతో ఎయిర్ ఇండియా తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఢిల్లీలో విమానం దిగగానే మిశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విమానాశ్రయం నుంచి అతడు దర్జాగా వెళ్లిపోయాడు. కాగా ఈ విషయమై జనవరి 4న పోలీసులకు ఎయిర్‌లైన్స్ ఫిర్యాదు చేసింది.

Bihar: నిద్రిస్తున్న రైతులపై విరుచుకపడ్డ పోలీసులు.. తీవ్ర ఆగ్రహంలో బిహార్‭ రైతులు