బెయిల్ ఇచ్చేది లేదు : చిదంబరానికి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు

  • Published By: sreehari ,Published On : September 30, 2019 / 10:45 AM IST
బెయిల్ ఇచ్చేది లేదు : చిదంబరానికి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి చుక్కెదురు అయింది. చిదంబరానికి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే కారణంతో ఆయనకు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేవేసింది. ఐఎన్ఎక్స్ కేసులో నిందుతుడిగా ఉన్న చిదంబరాన్ని సీబీఐ అధికారులు ప్రశ్నించిన అనంతరం ఆయన్ను అరెస్టు చేయగా ఆగస్టు నుంచి ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంటున్నారు.

ఈ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు అంత తీవ్రమైనవి కావని, 7ఏళ్ల వరకు శిక్ష మాత్రమే విధించవచ్చునని ఆయన వాదించారు. సాక్ష్యాలను దెబ్బతీసే అవకాశం లేదని హైకోర్టు తన ఉత్తర్వులలో తెలిపింది. కానీ, ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారిని చిదంబరం ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. చిదంబరం 2007లో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తమ సంస్థలోకి భారీగా విదేశీ నిధులపై సంతకం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 

ఈ విషయంలో తన కుమారుడు కార్తీ చిదంబరం కిక్‌బ్యాక్‌లు అందుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న పీటర్, ఇంద్రాణి ముఖర్జియా కలిసి ఐఎన్ఎక్స్ మీడియాను స్థాపించారు. ఈ కేసులో అపరాదిగా మారిన ఇంద్రాణి ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా దర్యాప్తు సంస్థలు చిదంబరాలపై విచారణ చేపట్టాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు.