కరోనా తగ్గినా..AC coaches లో బ్లాంకెట్ లు ఇవ్వం – ఇండియన్ రైల్వే

  • Published By: madhu ,Published On : September 6, 2020 / 10:56 AM IST
కరోనా తగ్గినా..AC coaches లో బ్లాంకెట్ లు ఇవ్వం – ఇండియన్ రైల్వే

Indian Railways : భారత దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినా..AC coaches లో బ్లాంకెట్లు, బెడ్ షీట్స్ సరఫరా చేయమని ఇండియన్ రైల్వే ప్రకటించింది. సొంత దుప్పట్లు తెచ్చుకుని ప్రయాణించాల్సి ఉంటుందని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు.

రైళ్లలో పరిశుభ్రత పాటించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని, అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 500 రైళ్ల నిర్వాహణ నిలిపివేస్తారనే జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఏ స్టేషన్ మూసివేయమని, రైళ్లను కొనసాగిస్తామన్నారు. ఐఐటీ ముంబై వారి సహకారంతో ‘Zero-Based Time Table’ ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.



ప్రయాణీకులకు సౌకర్యవంతంగా ఉంచేందుకు, రద్దీ లేకుండా చేసేందుకే ‘Zero-Based Time Table’ ఉద్దేశ్యమన్నారు. కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, ప్రస్తుతం ఉన్న రైళ్ల పేరు మార్చడం, షెడ్యూల్ చేయడం సాధ్యమేనన్నారు రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్.