prophet row: అస‌లు ఆందోళ‌న‌లో పాల్గొన్న‌ది ఎవ‌రో నాకు తెలియ‌దు: జామా మ‌సీదు షాహీ ఇమామ్

ఢిల్లీలోని జామా మ‌సీదు వద్ద శుక్ర‌వారం ప్రార్థ‌నల అనంత‌రం ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగడం క‌ల‌క‌లం రేపింది. అయితే, నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు తామేమీ పిలుపు ఇవ్వ‌లేదని జామా మ‌సీదు షాహీ ఇమామ్ అహ్మ‌ద్ బుఖారీ చెప్పారు.

prophet row: అస‌లు ఆందోళ‌న‌లో పాల్గొన్న‌ది ఎవ‌రో నాకు తెలియ‌దు: జామా మ‌సీదు షాహీ ఇమామ్

Jama Masque

prophet row: ఢిల్లీలోని జామా మ‌సీదు వద్ద శుక్ర‌వారం ప్రార్థ‌నల అనంత‌రం ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగడం క‌ల‌క‌లం రేపింది. అయితే, నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు తామేమీ పిలుపు ఇవ్వ‌లేదని జామా మ‌సీదు షాహీ ఇమామ్ అహ్మ‌ద్ బుఖారీ చెప్పారు. ”ప్రార్థ‌నల‌ అనంత‌రం ఒక్క‌సారిగా జామా మ‌సీదు చౌక్ (గేట్ నంబ‌రు 1) వ‌ద్ద పెద్ద ఎత్తున‌ నినాదాలు విన‌ప‌డ్డాయి. ఎవ‌రైనా నిర‌స‌న‌లకు పిలుపు ఇచ్చారా? అన్న విష‌యం గురించి నాకు ఏమీ తెలియ‌దు. ఈ ఆందోళ‌న‌ల‌కు జామా మ‌సీదు మాత్రం పిలుపు ఇవ్వ‌లేదు. అస‌లు నిర‌స‌న తెలిపిన వారు ఎవ‌రో కూడా నాకు తెలియ‌దు. ఈ విష‌యంపై పోలీసులు విచార‌ణ జ‌ర‌పాలి” అని ఆయ‌న అన్నారు.

prophet row: నిజం చెప్పినందుకు నురూప్ శ‌ర్మ‌కు బెదిరింపులు: ప్ర‌జ్ఞా సింగ్ ఠాకూర్

కాగా, మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్య‌లు చేయడంతో వారిపై బీజేపీ పార్టీప‌రంగా చర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం ప్రార్థ‌నల అనంత‌రం దేశంలోని ప‌లు ప్రాంతాల్లో మ‌సీదుల వ‌ద్ద ముస్లింలు నిర‌స‌న‌ల‌కు దిగారు. ఢిల్లీలోని జామా మ‌సీదులో దాదాపు 1,500 మంది నిర‌స‌నలో పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ముస్లింలు నిరసనకు దిగడంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నాయి. యూపీలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.