Supreme Court: ఏ కేసూ కోర్టుకు పెద్దది కాదు, చిన్నదీ కాదు.. సీజేఐ చంద్రచూడ్
ఈ కార్యక్రమానికి సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ సైతం పాల్గొన్నారు. వాస్తవానికి ఆయన శుక్రవారం సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్‌తో కలిసి ధర్మసనాన్ని పంచుకున్నారు. కాగా, ఈ రోజు స్మారకోత్సవంలో సైతం పాల్గొన్నారు. ‘‘ప్రపంచాన్ని మార్చడంలో న్యాయవ్యవస్థ ఆవశ్యకత ఎంతో ఉంది’’ అని జస్టిస్ మీనన్ అన్నారు.

Supreme Court: కోర్టులకు ఏ కేసు పెద్దది కాదని, అలా అని ఏ కేసూ చిన్నది కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. కోర్టుకు వచ్చే ప్రతి కేసు ముఖ్యమైందేనని, ప్రతి కేసుకు న్యాయం చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కొవిడ్ మహమ్మారి సమయంలో సుమారు 3 లక్షల కేసులను కోర్టు పరిశీలించిందని, ఇందులో చిన్నా, పెద్ద అన్ని కేసులు ఉన్నాయని, వాటిన్నిటినీ సమ ప్రాధాన్యతతో కోర్టు విచారణ చేపట్టిందని ఆయన అన్నారు.
శనివారం సుప్రీకోర్టు 73వ స్వారకోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘కోర్టు ముందు ఏ కేసూ పెద్దది కాదు, ఏ ఒక్క కేసు ప్రత్యేకమైంది కాదు. కోర్టుకు అన్ని కేసులు ముఖ్యమైనవే. ఎందుకంటే ఎక్కువగా వచ్చిన కేసులే మళ్లీ మళ్లీ వస్తుంటాయి. అయినప్పటికీ ప్రజలకు అందాల్సిన న్యాయాన్ని ఎంతో సహనంతో, ప్రాధాన్యతతో విచారించాలి. అప్పుడే సరైన న్యాయం అందుతుంది. రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను కోర్టులు కాపాడతాయి. ఎప్పుడైనా వారి హక్కులకు భంగం కలిగితే కోర్టు ద్వారా వారు పొందుతారు’’ అని అన్నారు.
Aaditya Thackeray: దమ్ముంటే నామీద పోటీ చెయ్.. సీఎం షిండేకు ఆదిత్య థాకరే సవాల్