No Charging: రాత్రుళ్లు రైళ్లలో ఛార్జింగ్ బంద్

ప్యాసింజర్స్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని ఫైర్ యాక్సిడెంట్లు కంట్రోల్ చేసేందుకు ఇండియన్ రైల్వే జోన్..

No Charging: రాత్రుళ్లు రైళ్లలో ఛార్జింగ్ బంద్

No Charging Of Electronic Devices On Trains At Night

No charging: ప్యాసింజర్స్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని ఫైర్ యాక్సిడెంట్లు కంట్రోల్ చేసేందుకు ఇండియన్ రైల్వే జోన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలో రాత్రిపూట ప్రయాణికులు చార్జింగ్‌ పాయింట్లను ఉపయోగించకూడదనే నిర్ణయం తీసుకుంది. ప్యాసింజర్స్ సేఫ్టీ రీత్యా రైళ్లలో చార్జింగ్ పాయింట్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్విచ్ ఆఫ్ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది’ అని రైల్వే వెల్లడించింది.

ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులు తమ మొబైల్స్, ల్యాప్‌టాప్స్ పగటిపూటనే ఛార్జింగ్ చేసుకునేందుకు పగటి సమయంలోనే వీలుంటుంది. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు సహా ఇతరత్రా విద్యుత్ పరికరాలకు రాత్రిపూట చార్జింగ్‌ పెట్టే క్రమంలో కొన్నిసార్లు ప్రమాదవశాత్తు వాటి వల్ల రైళ్లలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

అన్ని రైల్వే జోన్లలో ఈ రూల్స్ అమలు చేయాలని యోచిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డెహ్రాడూన్‌కు చెందిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మార్చి 13 న షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. అంతేకాకుండా రాంచీ స్టేషన్‌లోని స్టాటిక్ గూడ్స్ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది.

పలు భద్రతా చర్యలపై రైల్వే అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో వెల్లడించారు. రైళ్లలో అగ్ని ప్రమాదాలను తగ్గించడానికి ఇటీవల రైల్వే ధూమపానంపై అనేక కార్యక్రమాలను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ కారణంతోనే ఆన్‌బోర్డ్ రైళ్ళలో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల దేశంలోని 4వేల రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ ప్రీపెయిడ్ ఇంటర్నెట్ అందిస్తున్నట్టు భారతీయ రైల్వేకు చెందిన రైల్‌టెల్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.