రూ.2కే కరోనా టెస్టింగ్ స్వాబ్స్… స్వదేశీ ఉత్పత్తితో 90శాతం తగ్గిన ఖర్చు

  • Published By: venkaiahnaidu ,Published On : May 19, 2020 / 09:53 AM IST
రూ.2కే కరోనా టెస్టింగ్ స్వాబ్స్… స్వదేశీ ఉత్పత్తితో 90శాతం తగ్గిన ఖర్చు

ఈ నెల 12న జాతినుద్దేశించిన ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ..20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రధాని మోడీ స్థానికంగా ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల ఉపయోగాన్ని ప్రమోట్ చేశారు. అయితే ఇప్పటివరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులు ఇప్పుడు మేకిన్ ఇండియా ద్వారా మనకు చాలా చీప్ గా దొరుకున్నాయి.

దీనికి ఉదాహరణే… ఇప్పటివరకు చైనా నుంచి 17రూపాయాలు ఖర్చు పెట్టి  కరోనా టెస్టింగ్ లో ఉపయోగించే ఓ పుల్ల మాదిరగా ఉండే “స్వాబ్స్”ను కొనుగోలు చేస్తున్న భారత్ కు ఇప్పుడు మేకిన్ ఇండియా ద్వారా కేవలం 2రూపాయలకే అవి ఇప్పుడు మనకందబోతున్నాయి. ఈ స్వాబ్స్… పేషెంట్ల నోటి మరియు గొంతు శాంపిల్స్ సేకరణ కోసం ఉపయోగిస్తారు.

నేషనల్ హెల్త్ అథారిటీ(NHA)లో ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్ని జన్ ఆరోగ్య యోజన లో అధికారిగా ఉన్న వరుణ్ విహారి ఈ విషయాన్ని హైలెట్ చేశారు. స్థానికంగా వస్తువుల తయారీ ద్వారా మనకు ఎంత లాభం చేకూరనుందో ఆయన వివరించారు. స్వాబ్స్ ఉత్పత్తి స్థానికంగా ప్రారంభమైనట్లు వరుణ్ తెలిపారు. దీంతో త్వరలోనే ఇవి ఒక్కొక్కటి రూ.2రూపాయలకే మనకి అందనున్నాయని తెలిపారు.

స్వాబ్స్ తయారుచేసేందుకు ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేసే ఓ MSME(సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమ) మరియు తులిప్స్ కంపెనీ.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్,పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ వైరాలజీ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందాయి.

Read: వ్యాక్సిన్ లేకుండానే కరోనాను ఖతం చేసే కొత్త డ్రగ్