శ్రామిక్ రైళ్లకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు..రైల్వేశాఖ

  • Published By: venkaiahnaidu ,Published On : May 19, 2020 / 03:54 PM IST
శ్రామిక్ రైళ్లకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు..రైల్వేశాఖ

కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మార్చి-24నుంచి విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా స్వస్థలాక వెళ్లలేక,ఉన్నచోట ఉపాధి కోల్పోయి,చేతిలో చిల్లిగవ్వలేక,వందల కిలిమీటర్లకు కాలినడకతో స్వస్థలాకు వెళుతూ లక్షలాదిమంది వలసకూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాకు తరలించేందుకు రైల్వేశాఖ శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే.

ఐతే కొన్ని రాష్ట్రాలు వీటిపై అభ్యంతరం చెబుతున్నాయి. తమ రాష్ట్రాల మీదుగా రైళ్లను నడపవద్దని, తమ రాష్ట్రంలోని ఆపవద్దని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రామిక్ రైళ్లను నడిపేందుకు ఆయా రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాల అంగీకారంతోనే వలస కూలీలను రైళ్లలో తరలిస్తున్నారు.

అయితే పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలు… వలస కార్మికులతో వెళుతున్న శ్రామిక్ రైళ్లను వారి రాష్ట్రాల్లోకి అనుమతించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రామిక్ రైళ్లను నడిపేందుకు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని రైల్వే ప్రతినిధి రాజేష్ భాజ్ పయ్ తెలిపారు. మే-1నుంచి 1,565 శ్రామిక్ రైళ్లను నడిపామని,20లక్షల మంది వలసకూలీలను స్వస్థలాలకు చేర్చినట్లు తెలిపారు.