దేశంలోని ప్లాస్మా బ్యాంక్స్ డేటా లేదు…కేంద్రం

  • Published By: venkaiahnaidu ,Published On : September 20, 2020 / 08:45 PM IST
దేశంలోని ప్లాస్మా బ్యాంక్స్  డేటా లేదు…కేంద్రం

దేశంలో ప్లాస్మా బ్యాంకుల సంఖ్య‌కు సంబంధించి త‌మ ద‌గ్గ‌ర ఎలాంటి డేటా లేద‌ని కేంద్రం తెలిపింది. ప్లాస్మా బ్యాంకులు నెలకొల్పాలనే ప్రతిపాదనను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలించట్లేదని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే తెలిపారు. అయితే, ప్లాస్మా బ్యాంకులను ఏర్పాటు చేసే విష‌య‌లో కొన్ని రాష్ట్రాలు చొరవ ప్రదర్శిస్తున్నాయని చౌబే తెలిపారు.


కరోనా ట్రీట్‌మెంట్‌లో ప్లాస్మా చికిత్సను ప్రధానమైన భాగంగా తాము గుర్తించట్లేదని ఆయన అన్నారు. కరోనా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ‌కు సంబంధించి ప్లాస్మా చికిత్సను ఓ పరిశీలనాత్మక ట్రీట్‌మెంట్‌గా మాత్రమే కేంద్రం గుర్తించిందని చౌబే స్ప‌ష్టంచేశారు. రాజ్య‌స‌భ‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన స‌మాధానంలో ఆయ‌న ఈ వివ‌రాలు తెలియ‌జేశారు.