New Wedding Rules: “డీజే డ్యాన్సుల్లేవ్, క్లీన్ షేవ్‌తో ఉంటేనే పెళ్లికి రండి”

పెళ్లి విషయానికొస్తే, ప్రతి కమ్యూనిటీకి, గ్రామానికి విభిన్నమైన సంప్రదాయాలు ఉండటం సహజం. ఇలాగే రాజస్థాన్ లో ఒక కమ్యూనిటీ పెళ్లితో పాటు ఆ వేడుకకు వచ్చే అతిథులకు కూడా కొన్ని రూల్స్ చెప్పింది. పాలి జిల్లాల్లో ఉన్న 19గ్రామాల్లో ఉండే యువత గడ్డం పెంచుకుని ఉంటే పెళ్లి చేయకూడదు.

New Wedding Rules: “డీజే డ్యాన్సుల్లేవ్, క్లీన్ షేవ్‌తో ఉంటేనే పెళ్లికి రండి”

bald groom

New Wedding Rules: పెళ్లి విషయానికొస్తే, ప్రతి కమ్యూనిటీకి, గ్రామానికి విభిన్నమైన సంప్రదాయాలు ఉండటం సహజం. ఇలాగే రాజస్థాన్ లో ఒక కమ్యూనిటీ పెళ్లితో పాటు ఆ వేడుకకు వచ్చే అతిథులకు కూడా కొన్ని రూల్స్ చెప్పింది. పాలి జిల్లాల్లో ఉన్న 19గ్రామాల్లో ఉండే యువత గడ్డం పెంచుకుని ఉంటే పెళ్లి చేయకూడదు. పైగా ఏదైనా వివాహానికి వెళ్లాలనుకునే యువత కచ్చితంగా క్లీన్ షేవ్ చేసుకునే ఉండాలి.

“ఫ్యాషన్ ఓకే కానీ, ఆ పేరుతో గడ్డం పెంచుకున్న పెళ్లికొడుకులకు అనుమతి లేదు. పెళ్లి అనేది ఓ పవిత్రమైన కార్యం. పెళ్లికొడుకును రాజులా చూస్తారు కాబట్టి, క్లీన్ షేవ్ చేసుకోవాలి” అని కుమావత్ సంఘం పాలి జిల్లాలోని 19గ్రామాలకు తీర్మానం చేసింది.

కమ్యూనిటీ వివాహాలు, ఇతర సందర్భాల్లో జరిగే పెళ్లిళ్లకు కూడా ఖర్చులు తగ్గించాలని నిర్ణయించారు. వివాహ వేడుకల్లో డీజే డ్యాన్సులు, ఆల్కహాల్ తీసుకోవడం వంటిని నిషేదించింది. హల్దీ వేడుకలోనూ పసుపును అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

Read Also : యూపీ పెళ్లి వేడుక‌ల్లో గిఫ్ట్‌లుగా బుల్డోజ‌ర్లు

ఈ నిబంధనలు జిల్లాకు వలస వచ్చిన వారికి కూడా వర్తిస్తాయని తేల్చారు. దేశంలోని వివిధ ప్రాంతంలో నివసిస్తున్న 20వేల మంది కూడా ఇవే మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటారని స్థానిక అధికారులు అంటున్నారు.