బిగ్ బ్రేకింగ్ : దేశీయ విమాన సర్వీసులు పూర్తిగా రద్దు..19రాష్ట్రాలు కంప్లీట్ లాక్ డౌన్

బిగ్ బ్రేకింగ్ : దేశీయ విమాన సర్వీసులు పూర్తిగా రద్దు..19రాష్ట్రాలు కంప్లీట్ లాక్ డౌన్

దేశంలో కరోనా కేసులు సోమవారం(మార్చి-23,2020)నాటికి 415కు చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా కారణంగా దేశంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాపై భారత పోరాటంలో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ విమానసర్వీసులను వారం పాటు పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం…బుధవారం నుంచి అన్ని దేశీయ విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు  ప్రకటించింది. అయితే కార్గో ఫైట్ లకు మాత్రం మినహాయింపు ఉంది. ఇప్పటికే గాల్లోకి ఎగిరిన ప్యాసింజర్ విమానాలు అన్నీ మంగళవారం అర్థరాత్రి 11.59లోగా తమ గమ్యస్థానాలను చేరుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. 

దేశ రాజధానిలో లేదా వెలుపల విమానాలను అనుమతించబోమని నిన్నఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పినప్పుడు కేంద్రం ఎదురుదాడి చేసింది. దేశీయ విమాన కార్యకలాపాల్లో ఎటువంటి మార్పు ఉండదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిన్న స్పష్టం చేసింది. బెంగాల్ కు వచ్చే విమానాలన్నింటినీ రద్దు చేయాలని కోరుతూ ఇవాళ ఉదయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ సమయంలో ఇవాళ అన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో 19రాష్ట్రాలు పూర్తిగా లాక్ డౌన్ లో ఉన్నాయని ఇవాళ కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 6 రాష్ట్రాల్లో పాక్షికంగా లాక్ డౌన్ పాటిస్తున్నారని కేంద్ర వైద్యరోగ్వ శాఖ తెలిపింది. ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ బలరామ్‌ భార్గవ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్‌ వ్యాపించకుండా చైన్‌ బ్రేక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నమని చెప్పారు.

మాస్కులు, శానిటైజర్లు నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ ధరకు విక్రయించవద్దని నిర్దేశించారు. కరోనా పరీక్షల కిట్‌ తయారీ కోసం రెండు సంస్థలకు అనుమతి ఇచ్చాం. మాస్కులు, శానిటైజర్ల తయారీలో నిర్దేశించిన ప్రమాణాలు పాటించాలన్నారు. కోవిడ్‌-19 బాధితుల కోసం ఆస్పత్రులను సిద్ధం చేయాలని రాష్ర్టాలను కోరుతున్నట్టు ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ బలరామ్‌ భార్గవ చెప్పారు.

See Also | హైదరాబాద్‌‌లో రోడ్లపైకి వస్తే క్రిమినల్ కేసులు, వాహనాలు సీజ్