No Dowry Affidavit : కట్నం తీసుకోలేదని ఉద్యోగులంతా అఫిడవిట్ ఇవ్వండి, ప్రభుత్వం కీలక ఆదేశం

ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తమ వివాహ సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని ప్రకటిస్తూ అఫిడవిట్ సమర్పించాలి. ఈ మేరకు మహిళా సంక్షేమ శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది.

No Dowry Affidavit : కట్నం తీసుకోలేదని ఉద్యోగులంతా అఫిడవిట్ ఇవ్వండి, ప్రభుత్వం కీలక ఆదేశం

No Dowry Affidavit

No Dowry Affidavit : యూపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తమ వివాహ సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని ప్రకటిస్తూ అఫిడవిట్ సమర్పించాలంది. ఈ మేరకు యూపీ మహిళా సంక్షేమ శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది. 2004 ఏప్రిల్ 31 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అక్టోబర్ 18లోపు తమ అఫిడవిట్ లను ఈమెయిల్ చేయాలని ఆదేశించింది. దీనిని పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అక్టోబర్ 12న అన్ని శాఖల అధిపతులు, కమిషనర్లకు ప్రభుత్వం ఈ సర్క్యులర్ జారీ చేసింది.

“వరకట్నం నిరోధక చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి తీవ్రమైన ప్రయత్నంలో మా శాఖ ప్రభుత్వ ఉద్యోగుల నుండి కట్నం అఫిడవిట్ కోరడం ఇదే మొదటిసారి” అని మహిళా సంక్షేమ డైరెక్టర్ మనోజ్ రాయ్ అన్నారు.

Gita Shares : జాక్ పాట్ .. ఏడాదిలో రూ. లక్ష పెట్టుబడితో రూ.42 లక్షల సంపాదన

వరకట్న నిషేధ చట్టం, 1961 ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ సర్వెంట్లందరూ తాము వివాహం చేసుకున్నప్పుడు కట్నం స్వీకరించబోమని పేర్కొంటూ, జాయిన్ అయ్యే సమయంలో అఫిడవిట్ అందించాలని ఆదేశించారు. “ఇప్పుడు, మార్చి 31, 2004 తర్వాత వివాహం చేసుకున్న ఉద్యోగులను తాము వివాహం చేసుకున్నప్పుడు ఎలాంటి కట్నం అందలేదని అఫిడవిట్ అందించమని మేము కోరాము” అని మనోజ్ చెప్పారు.

1999 లో వరకట్న నిషేధ నియమాలను యూపీ రూపొందించింది (కేంద్రం చట్టాన్ని అనుసరించి). ఆ తర్వాత మార్చి 31, 2004 న నియమాలను సవరించింది. ప్రత్యేకంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన నియామకం సమయంలో తన వివాహం అప్పుడు ఎలాంటి కట్నం తీసుకోలేదని పేర్కొంటూ అపాయింట్‌మెంట్ అథారిటీకి అఫిడవిట్ అందించాలని రూల్ 5 లో చెప్పారు.

Android Phones Hack: మీ ఫోన్‌లో వైరస్ ఇలా గుర్తించండి.. వెంటనే తీసేయండి..!

అందువల్ల, అక్టోబర్ 18 లోపు కార్యాలయాలలో నియమించబడిన అన్ని ప్రభుత్వ ఉద్యోగుల నుండి తప్పనిసరిగా అఫిడవిట్ పొందాలని డిపార్ట్ మెంట్ హెడ్ లకు ప్రభుత్వం చెప్పింది. అఫిడవిట్ ఇవ్వని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంది. కాగా, వరకట్నం తీసుకోలేదని అఫిడవిట్ సమర్పించాలంటూ ప్రభుత్వం ఆదేశించడం చాలామంది ప్రభుత్వ ఉద్యోగులను ఇరకాటంలో పడేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వరకట్నం నిషేధ చట్టం ప్రకారం దేశంలో వరకట్నం చట్ట విరుద్ధం. వరకట్నం తీసుకున్నా లేదా ఇచ్చినా.. ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.15వేలు జరిమానా లేదా వరకట్నం విలువ ఏది ఎక్కువ అయితే అది జరిమానాగా విధిస్తారు.

సమాజం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నా, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఇంకా మన దేశంలో వరకట్నం అనే దురాచారం కొనసాగుతోంది. వరకట్నం నేరం అని చట్టాలు చెబుతున్నా మార్పు రావడం లేదు. పెళ్లి సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తరుఫు వారికి కట్నం ఇవ్వాల్సి వస్తోంది. వివాహం సమయంలో అడిగినంత కట్నం ఇచ్చినా పెళ్లయ్యాక అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అదనపు కట్నం ఇవ్వలేక, అత్తింటి వారు పెట్టే వేధింపులు తట్టుకోలేక పెళ్లైన కొన్ని రోజులకే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.