GST On Papad: అప్పడాలపై సోషల్ మీడియాలో రచ్చ.. క్లారిటీ ఇచ్చిన CBIC

అప్పడాలపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవ్వటంతో సాక్షాత్తు ప్రభత్వమే క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. హర్ష్ గోయెంకా రేపిన ఈ చర్చకు CBIC క్లారిటీ ఇచ్చింది.

GST On Papad: అప్పడాలపై సోషల్ మీడియాలో రచ్చ.. క్లారిటీ ఇచ్చిన CBIC

No Gst On Papad Whatever Its Shape Clarified By Cbic

GST On Papad : అప్పడాలు. పప్పు, పప్పుచారు అన్నంలో స్నాక్స్ గా తినే అప్పడాలపై చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు దాదాపు ప్రతీ వస్తువు మీద జీఎస్టీ పడుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో అప్పడాలపై కూడా జీఎస్టీ ఉందా? ఉంటే ఏ రకమైన అప్పడాలపై జీఎస్టీ ఉంది ? అప్పడాల షేపులను బట్టి జీఎస్టీ ఉంటుందా? అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వేటికి మినహాయింపు ఉందనే విషయంపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చపై చివరకు కేంద్రమే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ అప్పడాల చర్చ ఏంటీ? దీన్ని ఎవరు రేకెత్తించాలరు అంటే..

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయెంకా ఇటీవల ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. ఈ పోస్టే ఇప్పుడు అప్పడాలపై చర్చ జరిగేలా చేసింది. గోయెంకా పోస్ట్ చేసినదాంట్లో ‘‘గుండ్రంగా ఉన్న పాపాడ్లు, అలాగే చతురస్రాకారంలో ఉన్న అప్పడాల’’ ఫోటోలను షేర్‌ చేశారు. వీటిలో గుండ్రటి అప్పడాలకు జీఎస్‌టీ మినహాయింపు ఉందని..కానీ చతురస్రాకారపు ఆకారంలో ఉన్న అప్పడాలకు జీఎస్‌టీ మినహాయింపు లేదని వాటిపై జీఎస్టీ వేస్తున్నారు? అసలు ఇందులో లాజిక​ ఏముంది? ఎవరైనా చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఈ సందేహానికి బదులివ్వాలంటూ గోయెంకా ప్రశ్నించారు అదేనండీ అడిగారు.

అప్పడాలపై చర్చను రేకెత్తించిన గోయెంకా ట్వీట్‌
హర్ష్‌గోయెంకా ట్వీట్‌పై నెటిజన్లు స్పందించారు. గుండ్రటి అప్పడాలు చేతితో చేస్తారు కాబట్టి వీటికి జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉందని, చుతరస్రాకారపు అప్పడాలు మెషిన్‌ చేస్తారు కాబట్టి వాటికి జీఎస్‌టీ విధిస్తారంటూ చాలా మంది తమ అభిప్రాయం వెల్లడించారు. మరికొందరు చేతితో చేసే రౌండ్‌ షేప్‌ అప్పడాలు కుటీర పరిశ్రమ పరిధిలోకి వస్తాయని, అదే చతురస్రాకారపు అప్పడాలు భారీ పరిశ్రమ కిందకు వస్తాయని తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఇంకొందరైతే ఇదే విషయాన్ని బేస్ చేసుకుని జీఎస్‌టీ చట్టం ఏంటీ? వాటిలో ఎటువంటి నిబంధనలున్నాయి? అనే విషయాల జోలికి పోకుండా డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వంపైనా..ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌పై విమర్శలు చేశారు. అప్పడాలు రెండు ఒకటై అయినా రౌండ్‌ షేపులో ఉన్న అప్పడాలకు మినహాయింపు ఇచ్చి..అదే చతురస్రాకారంలోఉన్న వాటికి పన్ను వేయడం సరైంది కాదని ఇదొక పిచ్చి నిర్ణయమంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

గోయొంకా ఈ ట్వీట్‌ పోస్ట్‌ చేసి 24 గంటల గడవక ముందే వేలాది మంది స్పందించడం..ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు భారీగా పెరిగిపోవటంతో సాక్షాత్తు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (CBIC) విభాగం స్పందించాల్సి వచ్చింది. దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.పాపాడ్‌ (అప్పడం) ఎలాంటిదైనా సరే దానిపై ఎటువంటి జీఎస్‌టీ విధించడం లేదని ప్రకటించింది. పాపాడ్‌లను జీఎస్‌టీ నుంచి మినహాయించినట్టు పేర్కొంది. ఈ మేరకు హర్ష్‌ గోయెంకా ట్వీట్‌ని రీ ట్వీట్‌ చేస్తూ బదులిచ్చింది. ఆల్కహాల్‌, పెట్రోలియం ఉత్పత్తులు మినహా దాదాపు అన్ని రకాల ఉత్పత్తులు జీఎస్‌టీ పరిధిలో ఉన్నాయి.