IMD: మరో ఐదు రోజులు ఎండల్లేవ్

భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మరో ఐదు రోజుల పాటు ఎండలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. శనివారం రాజస్థాన్ లోని గంగానగర్ లో గరిష్ఠ ఉష్ణోగ్రత 44.2 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఈ మేరకు వాతావరణ ఏజెన్సీ విడుదల చేసిన బుల్లెటిన్..

IMD: మరో ఐదు రోజులు ఎండల్లేవ్

No Heatwave In Country Over Next 5 Days Imd

IMD: భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మరో ఐదు రోజుల పాటు ఎండలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. శనివారం రాజస్థాన్ లోని గంగానగర్ లో గరిష్ఠ ఉష్ణోగ్రత 44.2 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఈ మేరకు వాతావరణ ఏజెన్సీ విడుదల చేసిన బుల్లెటిన్.. మరో ఐదు రోజుల పాటు ఎండలు అనేవి ఉండబోవని స్పష్టం చేసింది.

చాలా ప్రదేశాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉంది. హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇదే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాటి కంటే రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్ లలో కాస్త ఎక్కువ టెంపరేచర్ నమోదైంది.

దేశంలో అనేక ప్రాంతాల్లో వర్షపాత సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ లోని అనేక ప్రాంతలు, జార్ఖండ్, బీహార్ లోని కొన్ని ప్రాంతాల్లో వాయువ్య బంగాళాఖాతం ప్రభావం కనిపిస్తుంది.

మధ్యప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాల వచ్చేశాయి. చత్తీస్ ఘడ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతల్లో మరో 24గంటల్లోకి రానున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.