హెల్మెట్ లేకపోతే బంక్ ల్లో పెట్రోల్ పోయరు

  • Published By: chvmurthy ,Published On : September 22, 2019 / 02:53 PM IST
హెల్మెట్ లేకపోతే బంక్ ల్లో పెట్రోల్ పోయరు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మోటారు వాహాన చట్టం పట్ల వాహానదారులకు అవగాహాన కల్పించే దిశలో భాగంగా కర్ణాటక పోలీసులు వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. వాహానదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే విధంగా కొత్త నిబంధన అమల్లోకి తేనున్నారు.  హెల్మెట్ లేని ద్విచక్ర వాహానదారులకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయకుండా కలబురిగి పోలీసులు ఆంక్షలు విధించారు. 

దీనిపై పోలీసు కమీషనర్ ఎంఎన్ నాగరాజు మాట్లాడుతూ..కలబురిగి పోలీసు కమీషనరేట్ పరిధిలో నో హెల్మెట్-నో పెట్రోల్ విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు.  సెప్టెంబర్ 29 నుంచి ఈ విధానాన్ని కమిషనరేట్ పరిధిలో  అమలు చేసేందుకు పోలీసులు సిధ్దమయ్యారు. ద్విచక్ర వాహానదారులను ప్రమాదాల బారినుంచి  తప్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్ పై అహగాహన పెంచనున్నారు. 

కేంద్రపభుత్వం సెప్టెంబరు 1 నుంచి తెచ్చిన కొత్త మోటారు వాహన చట్టాన్ని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తూ భారీ స్ధాయిలో జరిమానాలు విధిస్తున్నసంగతి తెలిసిందే.