UP CM Yogi: యూపీ సీఎం సంచలన నిర్ణయం.. ఆగస్టు 15న సెలవు రద్దు.. ఎందుకంటే?

సంచలన నిర్ణయాలకు కేంద్రంగా నిలిచే సీఎంలలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ఒకరు. మరోసారి దేశవ్యాప్తంగా యోగి ఆధిత్యనాథ్ పేరు మారుమోగుతుంది. వచ్చే ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో స్వాతంత్ర్య  దినోత్సవం నాడు సెలవును రద్దు చేస్తూ యోగి నిర్ణయించారు.

UP CM Yogi: యూపీ సీఎం సంచలన నిర్ణయం.. ఆగస్టు 15న సెలవు రద్దు.. ఎందుకంటే?

Cm Yogi

UP CM Yogi: సంచలన నిర్ణయాలకు కేంద్రంగా నిలిచే సీఎంలలో యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ఒకరు. ఆయన తీసుకొనే నిర్ణయాల్లో ఎక్కువగా సంచనాలు ఉంటాయి. వాటి అమల్లోనూ అంతే శ్రద్ధ ఉంటుంది. మరోసారి దేశవ్యాప్తంగా యోగి ఆధిత్యనాథ్ పేరు మారుమోగుతుంది. వచ్చే ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో స్వాతంత్ర్య  దినోత్సవం నాడు సెలవును రద్దు చేస్తూ యోగి నిర్ణయించారు. ఈ ఏడాది ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలతో పాటు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, మార్కెట్‌లు మూసివేయబడవని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇలా జరగడం 75 ఏళ్లలో ఇదే తొలిసారి.

UP CM Yogi : పాతబస్తీ భాగ్యలక్ష్మిఅమ్మవారిని దర్శించుకోనున్న యూపీ సీఎం యోగి..చార్మినార్ వద్ద భారీ బందోబస్తు

స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అవుతున్నందున ప్రతి జిల్లాలో ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమంగా ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ పేరుతో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ రోజున ఎప్పటిలాగే జెండా వందనం చేసి వెళ్లిపోవడం కాకుండా.. ఒక ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతోనే సెలవు రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు.

CM KCR: రద్దయిన ఏరియల్ సర్వే.. రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్

ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి.ఎస్.మిశ్రా మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని కేవలం అధికారిక కార్యక్రమంగానే కాకుండా.. ప్రజలను భాగస్వామ్యం చేసేలా చూడాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్‌తో పాటు సాధారణ ప్రజలు కూడా ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు నడిచే విధంగా యోగీ నిర్ణయం తీసుకోవటం జరిగిందని.. చరిత్రలో ఇదే మొట్టమొదటి సారి అని మిశ్రా వివరించారు.