Rs 2000 Notes Exchange : రూ.2 వేల నోట్ల మార్పిడి, బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ప్రూఫ్ అవసరం లేదు : ఎస్బీఐ

బ్యాంకుల్లో రూ.2,000 నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి కోసం ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు పత్రాలు సమర్పించడంతోపాటు ఒక ఫార్మ్ ను పూరించాల్సివుంటుందని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్ బీఐ దీనిపై స్పందించింది.

Rs 2000 Notes Exchange : రూ.2 వేల నోట్ల మార్పిడి, బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ప్రూఫ్ అవసరం లేదు : ఎస్బీఐ

SBI Statement

Rs 2000 Notes Exchange – SBI :  ఆర్థిక వ్యవస్థ నుంచి రూ.2 వేల నోట్ ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.2 వేల నోట్లు సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే చలామణిలో ఉంటాయని, ఆ తర్వాత చెల్లుబాటు కానివిగా భావించడం జరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది. ఈ లోపు రూ.2 వేల నోట్లు ఉన్నవారు బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది.

రూ.2 వేల నోట్ల మార్పిడి లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ప్రూఫ్ అవసరం లేదని ఎస్బీఐ పేర్కొంది. అలాగే ఏ విధమైన ఫామ్ లేదా స్లిప్ పూరించాల్సిన పని లేదని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఎస్ బీఐ తన అన్ని శాఖలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలాంటి గుర్తింపు కార్డు లేదా ఫామ్ లేకుండా రూ.20,000 వరకు రూ.2,000 నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయవచ్చని లేదా మార్చుకోవచ్చని తెలిపింది.

2000 Notes ban: బంగారం దుకాణాల‌వైపు బడా బాబుల పరుగు.. రూ. 2వేల నోట్లు మార్చుకొనేందుకు కొత్త మార్గాలు..

బ్యాంకుల్లో రూ.2,000 నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి కోసం ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు పత్రాలు సమర్పించడంతోపాటు ఒక ఫార్మ్ ను పూరించాల్సివుంటుందని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్ బీఐ దీనిపై స్పందించింది. రూ.2,000 నోట్ల మార్పిడి లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ప్రూఫ్ అవసరం లేదని, ఏ విధమైన ఫార్మ్ లేదా స్లిప్ పూరించాల్సిన పని లేదని పేర్కొంది.

కాగా, రూ.2,000 నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీబీ) శుక్రవారం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు ఆ నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చని లేదా తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని సూచించింది. ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాలతోపాటు ఇతర బ్యాంకులు రూ.2,000 నోట్లను మే23వ తేదీ నుంచి స్వీకరిస్తాయని వెల్లడించింది.

Rs 2000 denomination: రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నాం: ఆర్బీఐ సంచలన ప్రకటన

ఒకవేళ బ్యాంకులో ఖాతా లేకపోయినా రూ.20,000 వరకు రూ.2,000 నోట్లను మార్పిడి చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ నోట్లను మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవచ్చని పేర్కొంది. క్లీన్ నోట్ పాలసీ కింద రూ.2,000 నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నామని ఆర్బీఐ స్పష్టం చేసింది.