Delhi hospital: ఏ మతాన్నో.. భాషనో కించపరచాలని అనుకోలేదు – ఢిల్లీ హాస్పిటల్

మళయాళంలో కాకుండా హిందీ లేదా ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడాలని జారీ చేసిన సర్క్యూలర్ కు ఎట్టకేలకు క్షమాపణ చెప్పింది. 'సర్క్యూలర్ ను పాజిటివ్ దృక్పథంతోనే ఇష్యూ చేశాం. మళయాళం మాట్లాడే స్టాఫ్ కు వ్యతిరేకంగా చేయలేదు.

Delhi hospital: ఏ మతాన్నో.. భాషనో కించపరచాలని అనుకోలేదు – ఢిల్లీ హాస్పిటల్

Delhi Hospital

Delhi hospital: మళయాళంలో కాకుండా హిందీ లేదా ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడాలని జారీ చేసిన సర్క్యూలర్ కు ఎట్టకేలకు క్షమాపణ చెప్పింది. ‘సర్క్యూలర్ ను పాజిటివ్ దృక్పథంతోనే ఇష్యూ చేశాం. మళయాళం మాట్లాడే స్టాఫ్ కు వ్యతిరేకంగా చేయలేదు. దీని వల్ల ఎవరైనా స్టాఫ్ బాధపడితే మన్నించమని అడుగుతున్నా’ అని నర్సింగ్ సూపరింటెండెంట్ అన్నారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పోస్టు చేస్తూ.. ఫ్యూచర్ లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తానని మాటిచ్చారు. ఢిల్లీ హెల్త్ డిపార్ట్‌మెంట్…. గోవింద్ బల్లబ్ పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తో కలిసి సర్క్యూలర్ ఇష్యూ చేసింది.

జీబీ పంత్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఇష్యూ చేసిన సర్క్యూలర్.. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కు, ఢిల్లీ ప్రభుత్వానికి ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వెంటనే అమలవ్వాలంటూ ఇష్యూ చేసిందని మెడికల్ డైరక్టర్ అనిల్ అగర్వాల్ చెప్పారు.

ఈ సర్క్యూలర్ కారణంగా మెడికల్ ప్రటెర్నిటీ, పొలిటికల్ లీడర్లు, పబ్లిక్ నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ లీడర్లు రాహుల్ గాంధీ భాషా వివక్ష చూపిస్తున్నారంటూ తిట్టిపోశారు. పార్టీ లీడర్ శశి థరూర్ మాట్లాడుతూ.. ఆమోదయోగ్యం కానిది, మానవ హక్కుల ఉల్లంఘన, రెచ్చగొట్టేలా ఉందని సర్క్యూలర్ గురించి విమర్శించారు.

జీబీ పంత్ నర్సుల అసోసియేషన్ ప్రకారం.. 850 మంది నర్సులు హాస్పిటల్ లో పనిచేస్తుండగా 400 మంది మళయాళం మాట్లాడే వాళ్లు ఉన్నారు.