No job reservation: ప్రభుత్వ సంస్థలు ప్రైవేటైజేషన్ అయ్యాక రిజర్వేషన్స్ మాటేంటి

ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వం వాటా ఉన్న సంస్థలు దాదాపు ప్రైవేటీకరణకు రెడీ అయిపోతున్నాయి. ఒక వేళ అలానే జరిగితే

No job reservation: ప్రభుత్వ సంస్థలు ప్రైవేటైజేషన్ అయ్యాక రిజర్వేషన్స్ మాటేంటి

jobs-in-india

No job reservation: ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వం వాటా ఉన్న సంస్థలు దాదాపు ప్రైవేటీకరణకు రెడీ అయిపోతున్నాయి. ఒక వేళ అలానే జరిగితే కుల ప్రాతిపదికన దక్కే రిజర్వేషన్ల మాటేంటి. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు సేఫ్ కానీ కొత్త అభ్యర్థులకు అవకాశాల్లేనట్లేనా..

ఒకసారి షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ జరిగిపోయిన తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యంతో చర్చలు జరిపి ఇప్పటికే ఉన్న స్టాఫ్ కు మాత్రం ఉద్యోగ భద్రత కల్పిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్ పాలసీ డాక్యుమెంట్లో ట్రేడ్ ఆఫ్ అనేది కుదురుతుందని చెప్తోంది.

ఆ డాక్యుమెంట్లో ఏముందంటే.. ప్రభుత్వం స్టాఫ్ సంక్షేమం గురించి ఆలోచిస్తుంది. ఉద్యోగుల భద్రత, కంపెనీ నడపడానికి ఏదైనా ప్లాన్ ఉంటే ప్రైవేట్ యాజమాన్యం అమలుచేయొచ్చు. ఇటువంటి కాంపిటీటింగ్ ఇంటరెస్ట్ లను అగ్రిమెంట్లలో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.

పార్లమెంటులో రిజర్వేషన్ ఇష్యూపై భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణను ప్రస్తావించింది.

మానిషీ పఠాక్ లేబర్ లా నిపుణులు, లీగల్ కన్సల్టెన్సీ ఫామ్ ఫౌండర్.. మాట్లాడుతూ.. కేవలం రాష్ట్రాలకు మాత్రమే రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలివ్వాల్సిన బాధ్యత ఉంది. కేంద్రం లేదా రాష్ట్రాలు నడుపుతున్న సంస్థల్లో మాత్రం రిజర్వేషన్లు ఉంటాయి. అదే ప్రైవేట్ సెక్టార్ లో అటువంటి పాలసీలు అమల్లో ఉండాల్సిన అవసరం లేదు. అని చెప్తున్నారు.