India-Germany: భారత్‌తోనే ప్రపంచ సమస్యల పరిష్కారం: జర్మన్ మంత్రి

భారత్ లేకుండా ప్రపంచంలోని ఏ ప్రధాన సమస్యా పరిష్కారం కాదన్నారు జర్మన్‌కు చెందిన మంత్రి డా.టొబియాస్ లిండ్నర్. జర్మనీకి, భారత్ ప్రధాన భాగస్వామి అన్నారు.

India-Germany: భారత్‌తోనే ప్రపంచ సమస్యల పరిష్కారం: జర్మన్ మంత్రి

Dr Tobias Lindner

India-Germany: భారత్ లేకుండా ప్రపంచంలోని ఏ ప్రధాన సమస్యా పరిష్కారం కాదన్నారు జర్మన్‌కు చెందిన మంత్రి డా.టొబియాస్ లిండ్నర్. జర్మనీకి, భారత్ ప్రధాన భాగస్వామి అన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్-జర్మనీల మధ్య టెక్నాలజీ, ఎడ్యుకేషన్, భద్రత, వాతావరణ మార్పులు వంటి అంశాల్లో పరస్పర సహకారం పెంచుకుంటున్నాయని చెప్పారు.

PM Narendra Modi : 2022లో ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన.. ఏయే దేశాల్లో ఎప్పుడంటే?

‘‘అనేక అంశాల్లో భారత్ సహకారం కోరుతున్నాం. ప్రపంచంలోని ఏ ప్రధాన సమస్యైనా భారత్ లేకుండా పరిష్కారం కాదు. జర్మనీకి భారత్ కీలక భాగస్వామి. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపర్చుకుంటాం’’ అని టోబియాస్ వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో భారత ప్రధాని మోదీ జర్మనీలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జర్మన్ మంత్రి భారత్‌కు అనుకూల ప్రకటనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.