Corona Guidelines: మాస్కులు లేకుంటే పెట్రోల్ పోయొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు!

మాస్కులు లేకుంటే.. కరోనా ప్రోటోకాల్‌ పాటించకపోతే.. పెట్రోల్ పంపు నుంచి ఖాళీ చేతులతో తిరిగి రాక తప్పదు.

Corona Guidelines: మాస్కులు లేకుంటే పెట్రోల్ పోయొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు!

Corona Guidelines

Corona Guidelines: మాస్కులు లేకుంటే.. కరోనా ప్రోటోకాల్‌ పాటించకపోతే.. పెట్రోల్ పంపు నుంచి ఖాళీ చేతులతో తిరిగి రాక తప్పదు. మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పష్టంగా ఈమేరకు ఆదేశాలు జారీచేశారు. పెట్రోల్, డీజిల్ పట్టించుకునేందుకు వెళ్లేవారు మాస్క్ లేకుండా పెట్రోల్, డీజిల్ పట్టించుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది అక్కడి ప్రభుత్వం.

మధ్యప్రదేశ్‌లో కరోనా రోగులు నిరంతరం పెరుగుతున్న కారణంగా గడిచిన 24 గంటల్లో 1300 మందికి పైగా కరోనా రోగులు వెలుగులోకి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కరోనా ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. మాస్క్ లేకుండా పెట్రోల్-డీజిల్ పోయొద్దని పెట్రోల్ బంకర్లను కూడా ఆదేశించారు.

మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఉత్తర్వులు ప్రకారం.. మాస్క్ ధరించకుండా పెట్రోల్ పంప్‌కు వెళ్లే డ్రైవర్లకు డీజిల్, పెట్రోల్ లభించదు. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడుతున్నాయి. కరోనాపై పోరులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలని హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సూచించారు.

మధ్యప్రదేశ్‌లో, కరోనా నివారణ కోసం, చాలా జిల్లాల్లో, కరోనా ప్రోటోకాల్ పాటించని వ్యక్తులకు స్పాట్ ఫైన్ వేస్తున్నారు. దీంతో పాటు ఎక్కువగా ప్రభావితమైన జిల్లాల్లో సెక్షన్ 188 కింద కూడా కేసులు నమోదు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. భోపాల్, ఉజ్జయిని, ఇండోర్ మొదలైన జిల్లాల్లో కరోనా తీవ్రంగా ఉంది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాస్కుల విషయంలో కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. స్పాట్ ఫైన్‌ను సత్వరమే అమలు చేయాలని కోరారు. మాస్క్ గురించి హోంమంత్రి ప్రకటన వెలువడిన తర్వాత, కరోనాను నివారించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోబోతోందని స్పష్టమైంది.