PM Modi : వాళ్లు ఎంతటి బలవంతులైనా వదలిపెట్టం

 గుజరాత్‌లోని కేవడియాలో బుధవారం జరిగిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు.

PM Modi :  వాళ్లు ఎంతటి బలవంతులైనా వదలిపెట్టం

Pm

PM MODI గుజరాత్‌లోని కేవడియాలో బుధవారం జరిగిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. గత ప్రభుత్వాల తప్పుడు చర్యల ఫలితంగానే దేశంలో అవినీతి పెరిగిపోయిందని..ఇప్పుడు తమ ప్రభుత్వం గొప్ప సంకల్పంతో అవినీతిపై పోరాటం చేస్తోందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. అవినీతిపై పోరాడాలనే దృఢ నిశ్చయం గత ప్రభుత్వానికి లేదన్నారు.

అవినీతిపై పోరాడగలమని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిని తాము పొందగలమని ప్రజలకు తమ ప్రభుత్వం నమ్మకం కలిగించిందన్నారు. గడిచిన ఆరేడు సంవత్సరాలుగా తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా దేశంలో అవినీతికి తావులేదని నిరూపించామన్నారు. అవినీతిపరులు తప్పించుకోలేరని ఇప్పుడు దేశం నమ్ముతోందని మోదీ అన్నారు.

అవినీతి అనేది తక్కువ ఉన్నా.. ఎక్కువగా ఉన్నా సామాన్యుల హక్కులను పోగొడుతుంది. దేశ ప్రగతికి ఇది ఆటంకం, మన సమష్టి శక్తిపై ప్రభావం చూపుతుందని మోదీ చెప్పారు. ప్రజల నుంచి దోచుకొని, దేశాన్ని మోసం చేసే వారు ఎంత బలవంతులైనా తాము కనికరం చూపించబోమని దేశం నమ్ముతోందన్నారు. ప్రభుత్వం ఇలాంటివారిని అసలు విడిచిపెట్టదన్నారు. గత ప్రభుత్వాలకు రాజకీయ, పరిపాలనా సామర్థ్యం రెండూ లేవని, ఇప్పుడు.. అవినీతిని పారదోలే పటిష్ఠ వ్యవస్థ, రాజకీయ సంకల్పం తమకున్నాయని మోదీ అన్నారు .

ALSO READ  ప్రియాంక కాన్వాయ్ ని మరోసారి అడ్డుకున్న యూపీ పోలీసులు