Tamil Nadu: అదంతా డ్రామా, తమిళనాడులో బిహారీలెవరూ దాడికి గురవ్వలేదు.. తేల్చి చెప్పిన నివేదిక

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని వలస కార్మికుల ప్రాంతాల్లో పర్యటించారు. పుకార్లు జరుగుతున్నట్టుగా వారికి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. తమిళనాడులో గణనీయమైన సంఖ్యలో వలస కార్మికుల జనాభా ఉంది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి అనేక మంది తమిళనాడులోని నిర్మాణ రంగాలలో పనిచేస్తున్నారు.

Tamil Nadu: అదంతా డ్రామా, తమిళనాడులో బిహారీలెవరూ దాడికి గురవ్వలేదు.. తేల్చి చెప్పిన నివేదిక

No Migrant Attacked, Says Bihar Team

Tamil Nadu: తమిళనాడులో బిహార్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని వచ్చినవి కేవలంపుకార్లేనని, వాస్తవానికి అక్కడ ఎలాంటి దాడులు జరగలేదని తమిళనాడుకు వెళ్లిన బిహార్ నిపుణుల బృందం స్పష్టం చేసింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాలు తిరిగి బీహార్‌కు తిరిగి వచ్చిన ఆ బృందానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వలస కార్మికులపై తమిళనాడులో ఎలాంటి దాడి జరగలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు.

Karnataka Polls: బీజేపీకి షాకిచ్చిన ఎమ్మెల్సీ.. పదవికి, పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‭లో చేరిక

డీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడులో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ నకిలీ వీడియో ఒకటి మార్చి 6న వెలుగులోకి వచ్చింది. ట్విట్టర్‌లో తనను తాను పబ్లిక్ ఫిగర్, జర్నలిస్టుగా చెప్పుకున్న మనీష్ కశ్యప్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ నకిలీదని తేలింది. వీడియోలో కెమెరాతో మాట్లాడే ముందు వలస కార్మికులలో ఒకరు నవ్వుతున్నట్లు స్పష్టంగా చూడొచ్చు. అయితే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తమిళనాడు పోలీసులు పేర్కొన్నారు.

MP Avinash Reddy : ఆస్తుల కోసమే వివేకా హత్య.. ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వలసదారుల దాడులకు సంబంధించిన నకిలీ వీడియో మార్చి 6న పాట్నాలోనే చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఒక అధికారి మాట్లాడుతూ “బీహార్ పోలీసులు ఉత్కంఠను చేధించారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో కూలీలను కొట్టే వీడియో ఒకటి ఎలా రూపొందించబడిందో వారు తెలుసుకున్నారు” అని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ “వలసదారులపై దాడులపై తప్పుడు వార్తలను షేర్ చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు” అని అన్నారు.

Viral Video: హోలీ వేడుకల్లో జపనీస్ మహిళతో అసభ్య ప్రవర్తన.. వైరల్ అవుతున్న వీడియో

తమిళనాడుకు వెళ్లిన బిహార్ కమిటీకి నేతృత్వం వహించిన బాలమురుగన్ డి మాట్లాడుతూ ‘‘వలసదారులపై ఆరోపించిన దాడికి సంబంధించిన ప్రతి సమాచారం పుకార్లపై ఆధారపడి ఉంది. సోషల్ మీడియాలో ప్రచారం అయిన వీడియోలు, పోస్ట్‌లలో ఎటువంటి వాస్తవం లేదు” అని అన్నారు. ఫేక్ వీడియోలను పోస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని బీహార్ సీనియర్ పోలీసు అధికారి జితేంద్ర సింగ్ గంగావర్ విలేకరులతో అన్నారు.

తమిళనాడులో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయన్న పుకార్లను ఎలా ఛేదించాలనే దానిపై ఆ రాష్ట్ర పోలీసులు తాజాగా మార్గదర్శకాలను విడుదల చేశారు. పుకార్లు, ప్రచారం, తప్పుడు సమాచారం వంటి వాటిపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు ఫిర్యాదు చేయవచ్చు. ఇవి ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేయడానికి ఐదుగురు సీనియర్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. సమాచారాన్ని అందించడానికి వాట్సాప్ నంబర్ సైతం విడుదల చేశారు.

Data brokers: డేటా బ్రోకర్ ఉల్లంఘనలో ఇండియా 2వ స్థానం.. దేశంలో 1.8 కోట్ల మంది డేటా లీక్

దీనికి ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని వలస కార్మికుల ప్రాంతాల్లో పర్యటించారు. పుకార్లు జరుగుతున్నట్టుగా వారికి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. తమిళనాడులో గణనీయమైన సంఖ్యలో వలస కార్మికుల జనాభా ఉంది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి అనేక మంది తమిళనాడులోని నిర్మాణ రంగాలలో పనిచేస్తున్నారు.

MLC Kavitha : రేపే కవిత ఈడీ విచారణ.. న్యాయ నిపుణలతో భేటీ, ఢిల్లీకి కేటీఆర్

రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే పుకార్ల వెనుక ప్రత్యర్థి రాజకీయ పార్టీల హస్తం ఉందని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వాన్ని, పరిపాలన మీద తప్పుడు ప్రచారం చేయడానికి ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని అన్నారు. బిహార్ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల బృందం.. నకిలీ వీడియోలు బయటపడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతినిధి బృందం ఇంతకుముందు తిరుపూర్, కోయంబత్తూర్‌లకు వెళ్లింది. ఈ రెండు నగరాల్లో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు పనిచేస్తున్నారు.