TRAI: గుర్తు తెలియని మొబైల్ నెంబర్లతో జరిగే మోసాలకు చెక్.. త్వరలో కొత్త చట్టం తేనున్న కేంద్రం

గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్, వేధింపులకు చెక్ పడబోతుంది. ఇకపై ఎవరు కాల్ చేసినా వారికి సంబంధించిన కచ్చితమైన పేరు తెలుస్తుంది. దీని కోసం కేంద్రం కొత్త చట్టం రూపొందిస్తుంది.

TRAI: గుర్తు తెలియని మొబైల్ నెంబర్లతో జరిగే మోసాలకు చెక్.. త్వరలో కొత్త చట్టం తేనున్న కేంద్రం

TRAI: మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్. త్వరలో గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే కాల్స్, మోసాలకు చెక్ పడనుంది. దీని కోసం కేంద్రం కొత్త చట్టం తేనుంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ చాలా వరకు ఇబ్బంది పెట్టేవే ఉంటాయి. రకరకాల వేధింపులు, బెదిరింపులు ఉంటాయి.

Minor Girl: ఆటోలో బాలికపై డ్రైవర్ లైంగిక దాడి.. వేగంగా వెళ్తున్న ఆటోలోంచి దూకిన బాలిక.. వీడియోలో రికార్డైన ఘటన

కొన్నిసార్లు ఆర్థిక మోసాలకు కూడా కారణమవుతుంటాయి. వీటిపై ఫిర్యాదు చేసినా కొన్నిసార్లు ఫలితం ఉండదు. ఎందుకంటే ఆ నెంబర్లు నకిలీ ఐడీ ప్రూఫ్‌లతో తీసుకునేవి అయి ఉంటాయి. దీంతో ఆ నెంబర్లు ఎవరివో కనుక్కోవడం కష్టం. కానీ, ఇకపై ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) తేనున్న కొత్త చట్టం ద్వారా ఇలాంటి మోసాలకు చెక్ పడే అవకాశం ఉంది. పూర్తిగా కాకపోయినా, దీని ద్వారా మోసాలు, వేధింపులు చాలా వరకు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇంతకీ కేంద్రం ఏం చేయబోతుందంటే.. మొబైల్ నెంబర్ ఉపయోగించాలంటే కేవైసీ విధానం తీసుకురానుంది. దీని ద్వారా ప్రతి నెంబర్‌కు సంబంధించిన కచ్చితమైన వివరాలు టెలికాం ఆపరేటర్ల దగ్గర నమోదవుతాయి.

Bengaluru woman: ఆటోలో ఎయిర్‌పాడ్స్ మరిచి ఆఫీసుకు వెళ్లిపోయిన మహిళ.. డ్రైవర్ చేసిన పనికి నెటిజన్ల ఫిదా

ప్రతి నెంబర్ వాడుతున్న వారి పేరును సంస్థలు నమోదు చేస్తాయి. ఇది అమలైతే చాలా వరకు వినియోగదారులకు మేలు జరిగే అవకాశం ఉంది. దీన్ని పూర్తిగా అమలు చేస్తే.. కాల్ రిసీవ్ చేసుకున్న వారికి ఆ నెంబర్ ఎవరిదో సేవ్ చేసుకోకపోయినా వారు కేవైసీలో ఇచ్చిన పేరు కనిపిస్తుంది. కేవైసీ ద్వారా మోసానికి తక్కువ అవకాశం ఉంటుంది. అసలైన వినియోగదారుల నుంచే పేరు, వివరాలు సేకరిస్తారు. వాటిని సంస్థలు సేవ్ చేసుకుంటాయి. ఆ నెంబర్ నుంచి ఎవరికి కాల్ వెళ్లినా, ఆ పేరు కనిపిస్తుంది. ప్రస్తుతం ట్రూ కాలర్ వంటి యాప్స్ వాడుతున్నా అవి కాల్ చేసే వారి కచ్చితమైన సమాచారం అందించలేవు. అయితే, కొత్త చట్టం ద్వారా అసలైన సమాచారం అందుతుంది.