Covid-19 : ఇండియాకు బిగ్ రిలీఫ్.. వారం రోజులుగా దేశంలోని 180 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసూ లేదు

దేశ‌మంత‌టా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. పల్లె, పట్టణం అనే తేడా లేదు.. కరోనా విలయతాండవం చేస్తోంది. రోజూ లక్ష‌ల్లో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు న‌మోదవుతున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది.

Covid-19 : ఇండియాకు బిగ్ రిలీఫ్.. వారం రోజులుగా దేశంలోని 180 జిల్లాల్లో ఒక్క కొత్త కరోనా కేసూ లేదు

Covid 19

Covid-19 : దేశ‌మంత‌టా క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. పల్లె, పట్టణం అనే తేడా లేదు.. కరోనా విలయతాండవం చేస్తోంది. రోజూ లక్ష‌ల్లో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు న‌మోదవుతున్నాయి. గత మూడు రోజులుగా 4లక్షలకు పైగా రోజువారీ కేసులు వెలుగుచూస్తున్నాయి. రోజువారీ మరణాల సంఖ్య 4వేలు దాటింది.

ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. దేశంలోని 180 జిల్లాల్లో గ‌త వారం రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా న‌మోదు కాలేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఒక ప్ర‌క‌ట‌న చేసింది. ఇక 18 జిల్లాల్లో అయితే గ‌త 14 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా లేద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 54 జ‌ల్లాల్లో అయితే గ‌త మూడు వారాలుగా ఒక్క కొత్త కేసూ లేద‌ంది.

ఇక ప్రస్తుతం ఐసీయూ బెడ్స్ పై 4,88,861 ఉన్నారు. వారిలో 1,70,841 మంది వెంటిలేటర్ పై ఉన్నారు. 9,02,291 మంది రోగులకు ఆక్సిజన్ సపోర్ట్ అందిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

దేశంలో వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 16.73 కోట్లు దాటింది. నిన్న ఒక్క రోజే 23లక్షల మంది టీకా ఇచ్చారు. రాష్ట్రాలకు 17,49,57,770 వ్యాక్సిన్ డోసులు సరఫరా చేశాము. అందులో 16,65,49,583 డోసులు వాడారు. ఇంకా 84,08,187 డోసులు రాష్ట్రాల దగ్గర అందుబాటులో ఉన్నాయి. మొత్తం 53,25,000 టీకా డోసులు పైప్ లైన్ లో ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే రాష్ట్రాలకు సరఫరా చేస్తాం” అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

టీకా రెండు డోసులు తీసుకోవడం ద్వారా సంపూర్ణ రక్షణ లభిస్తుందని కేంద్రం చెప్పింది. తొలి డోసు తీసుకున్న వారంతా కచ్చితంగా రెండో డోసు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. సెకండ్ డోసు.. కోవిడ్ కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుందని చెప్పింది. దేశంలో కరోనా టెస్టుల సంఖ్య రోజుకు 25లక్షలకు పెరిగినట్టు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు 30,60,18,044 కరోనా నిర్ధారణ టెస్టులు చేశారు.