పాతవాళ్లే మళ్లీ….ఢిల్లీ కేబినెట్ లో కొత్తవాళ్లకు నో ప్లేస్

  • Published By: venkaiahnaidu ,Published On : February 12, 2020 / 01:43 PM IST
పాతవాళ్లే మళ్లీ….ఢిల్లీ కేబినెట్ లో కొత్తవాళ్లకు నో ప్లేస్

ఢిల్లీ కేబినెట్ లో కొత్త ఫేస్ లు ఉండవని తెలుస్తోంది. మొదటి టర్మ్ లో మంత్రులుగా ఉన్నవారినే మరోసారి కొనసాగించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సారి ఢిల్లీ కేబినెట్ లో రెండు కొత్త ముఖాలు(రాఘవ్ చద్దా,అతిషి )కన్పించనున్నట్లు వదంతులు వినిపిస్తున్న సమయంలో కేజ్రీవాల్ సన్నిహిత వ్యక్తుల నుంచి ఈ సమాచారం బయటికొచ్చింది.  రాఘవ్ చద్దా,అతిషి ఇద్దరూ ఇప్పటివరకు ఆప్ గవర్నమెంట్ సలహాదారులుగా ఉన్న విషయం తెలిసిందే.

పాతవారినే కేబినెట్ లోని పునరుద్దరించాలని కేజ్రీవాల్ డిసైడ్ అయ్యారని,వారి సనితనం వల్లే ఢిల్లీలో మరోసారి ఘనవిజయం సాధ్యమైందని కేజ్రీవాల్ భావించినట్లు ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే కేబినెట్ లో కూడా పాత కేబినెట్ లో ఉన్న మనీషి సిసోడియా,సత్ర్యేంద్ర జైన్,గోపాల్ రాయ్,కైలాష్ గెహ్లోట్,ఇమ్రాన్ హుస్సేన్,రాజేంద్ర పాల్ గౌతమ్ లు ఉండనున్నారు.

ఫిబ్రవరి-8,2020న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆప్ కు మొత్తం 70స్థానాల్లో 62సీట్లు వచ్చాయి. బీజేపీ కేవలం 8సీట్లలో మాత్రమే విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ మరోసారి తన సున్నా రికార్డును నిలబెట్టుకుంది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ,మొన్న జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు ఆప్ ప్రభంజనంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే.

మంగళవారం(ఫిబ్రవరి-11,2020)ఢిల్లీ ఫలితాల విడుదల అనంతరం ఆప్ అధినేత కేజ్రీవాల్ మాట్లాడుతూ…సరికొత్త రాజకీయాలకు ఇది ప్రారంభమని, ఇది కొత్త సంకేతమని అన్నారు. కామ్ కీ రంజీతీ అంటూ ఆప్ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. స్కూల్స్,మొహల్లా క్లీనిక్స్,2గంటల విద్యుత్తు,ఉచిత నీరు కోసం ఢిల్లీ ప్రజలు ఓటు వేశారని,ఇది దేశానికి గొప్ప సందేశమని కేజ్రీవాల్ అన్నారు. ఫిబ్రవరి-16,2020న కేజ్రీవాల్ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో మూడవసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.